ద‌ళ‌ప‌తిగా విజ‌య్ వ‌చ్చేది ఎప్పుడు..?

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (20:32 IST)
దళపతి విజయ్ హీరోగా ‘తెరి’, ‘మెర్సల్‌’ తరువాత యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాట్రిక్‌ చిత్రం బిగిల్‌. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, యోగిబాబు, ‘పరియేరుం పెరుమాల్‌’ ఫేం కదిర్‌, వివేక్, జాకీష్రాఫ్, డానియెల్ బాలాజీ, ఆనంద్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆసక్తికరమైన స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫస్ట్ లుక్‌ని విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల రిలీజ్ చేసారు.
 
విజయ్ రెండు లుక్స్‌‌లో ఉన్న పోస్టర్ విడుదల చేసి ఆయన అభిమానుల్లో సంబరాలు నింపారు చిత్ర యూనిట్. అయితే అందులో ఒక‌టి లోకల్ డాన్ పాత్ర కాగా, మ‌రొక‌టి ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ పాత్ర అని తెలుస్తుంది. ఏఆర్ రెహ‌మాన్ సంగీత సారథ్యంలో స్వరపరచిన ‘సింగపెన్నే’ అనే సింగిల్‌ ట్రాక్‌ను ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేయాగా, ఆ పాటకు శ్రోతల నుండి విశేషమైన స్పందన లభించింది. ఇకపోతే ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు, సినిమా యూనిట్ ఒక పోస్టర్ తోపాటు ప్రకటనను రిలీజ్ చేయడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం సార్, రైల్వేకోడూరు టికెట్ ఇప్పిస్తామని రూ.7 కోట్లు తీసుకున్నారు: బాబుకి టీడిపి కార్యకర్త వీడియో

రిపోర్ట్ వచ్చేవరకూ ఆ 2000 కోళ్లను ఎవ్వరూ తినొద్దు

మనిద్దరి మధ్య మా ఆయన అడ్డుగా వున్నాడు, చంపేయ్: ప్రియుడితో వివాహిత

ట్రంప్ మళ్లీ కొత్త మెలిక: మధుమేహం, ఊబకాయం వుంటే వీసా రిజెక్ట్

బావతో భార్య నవ్వుతూ మాట్లాడిందని పీక కోసిన భర్త, ఆపై ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments