Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ రావణాసుర స్పెషల్ సాంగ్ స్టిల్ విడుదల

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (07:30 IST)
Ravanasura Special Song Still
రవితేజ,  క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'రావణాసుర' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా  నిర్మిస్తున్నాయి. అభిషేక్ నామా, రవితేజ నిర్మాతలు.
 
ఫస్ట్ , స్పెషల్ ట్రాక్ గురించి అప్‌డేట్‌ తో వచ్చారు మేకర్స్ . హర్షవర్ధన్ రామేశ్వర్,  భీమ్స్ కలిసి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని  మొదటి పాటను పాపులర్ మ్యూజిక్ వేదిక్ బ్యాండ్ శాంతి పీపుల్ చేతుల మీదగా ఫిబ్రవరి 5న హైదరాబాద్‌లో లాంచ్ చేయనున్నారు.
 
రవితేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది. సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో  ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.
 
సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో  అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు.  
 విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 ఏప్రిల్ 7, 2023న వేసవిలో రావణాసురు థియేటర్స్ లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
 
తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments