Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేయింబవుళ్లూ కష్టపడుతూ సర్దుకునిపోతే కనెక్ట్ కావొచ్చు : రాశి

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (10:02 IST)
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టో హీరోయిన్లు ఎక్కువ కాలం కెరీర్‌ను కొనసాగించలేకపోవడానికి గల కారణాలపై సిని నటి రాశి ఖన్నా తనదైనశైలిలో వివరించింది. రేయింబవుళ్లు కష్టపడుతూ సర్దుకుని పోయే ధోరణివున్నట్టయితే ఇండస్ట్రీలో ఎక్కువకాలం ముగడ కొనసాగించవచ్చని ఆమె చెప్పుకొచ్చారు.
 
ఇటీవల తమిళంలో ఆమె నటించిన 'ఇమైక్కా నొడిగళ్‌' ప్రేక్షకాదరణ పొందింది. ప్రస్తుతం 'సైతాన్‌ కా బచ్చన్' షూటింగ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా ఎవరో కొందరికి తప్ప, హీరోయిన్ల తెర జీవితం తక్కువగా ఉండటానికి కారణం ఏంటని రాశిని ప్రశ్నించారు. 
 
దీనికి ఆమె సమాధానమిస్తూ, 'ప్రతిదీ ప్లాన్‌ చేసుకుని పనిచేయడం నాకు అలవాటు లేదు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ, చేతిలో ఉన్న క్షణాలను జారవిడుచుకోవడం నాకు నచ్చదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాను' అని చెప్పుకొచ్చింది.
 
అంతేకాకుండా, 'ఇక్కడ నిజాయతీగా కష్టపడితే, చేస్తున్న పనిపట్ల నిబద్ధతతో వ్యవహరిస్తే అవకాశాలు ఉంటూనే ఉంటాయి' అని చెప్పింది. ఎలాంటి పాత్రల్లో నటించడానికి ఇష్టపడతారు అని అడగ్గా 'సినిమా కథ వినగానే ఎమోషనల్‌గా మనం కనెక్ట్‌ కాగలగాలి. అలాంటి పాత్రల్లో నటించడం చాలా తేలిగ్గా ఉంటుంది. నాకు ఇప్పటిదాకా బాగా పేరు తెచ్చిపెట్టిన ప్రతి చిత్రంలోనూ అలాంటి పాత్రనే చేశా' అంటూ సమాధానమిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

బొత్తిగా రోడ్ సెన్స్ లేదు, కళ్ల ముందు కనిపిస్తున్నా ఎలా ఢీకొట్టేసాడో చూడండి (video)

పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

మోహన్ బాబును అరెస్టు చేస్తాం : రాచకొండ సీపీ వెల్లడి (Video)

జనసేనలోకి మంచు మనోజ్.. మౌనికా రెడ్డి!! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments