Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూని బాబ్జీ పాత్ర‌లో రావు ర‌మేష్‌

Webdunia
మంగళవారం, 25 మే 2021 (17:36 IST)
Rao Ramesh
విల‌క్ష‌ణ న‌టుడు రావు ర‌మేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న మ‌హా స‌ముద్రం చిత్రం నుండి రావుర‌మేష్కి బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ పోస్ట‌ర్‌తో పాటు ఈ మూవీలో రావు ర‌మేష్ గూని బాబ్జీగా ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలిపింది. ఇలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్‌కి రావు రమేష్ త‌న‌దైన న‌ట‌న‌తో పూర్తి న్యాయం చేస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చు.
 
శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న మ‌హాస‌ముద్రం చిత్రాన్ని దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌లైన శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్‌, అధితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్, జ‌గ‌ప‌తిబాబు లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.
 
ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేఎల్ ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌, కొల్ల అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.
 
సాంకేతిక వ‌ర్గం:
‌ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి
నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం
కో- ప్రొడ్యూస‌ర్‌: అజ‌య్ సుంక‌ర‌
బ్యాన‌ర్‌: ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: కిషోర్ గ‌రికిపాటి
సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్
సినిమాటోగ్ర‌ఫి: రాజ్‌తోట
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: అవినాష్ కొల్లా
ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ కేఎల్‌
యాక్ష‌న్‌: వెంక‌ట్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి బావిలో దూకిన వ్యక్తి.. తర్వాత ఏమైంది?

బ్యాంకాక్ భూకంపం నుంచి తప్పించుకుని ప్రాణాలతో తిరిగొచ్చిన ఎమ్మెల్యే ఫ్యామిలీ!

'విశ్వావసు'లో సకల విజయాలు కలగాలి : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments