Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ఇంట‌ర్వ్యూనే చంద్ర‌మోహ‌న్‌ను చంపేసిందా! (video)

Advertiesment
ఆ ఇంట‌ర్వ్యూనే చంద్ర‌మోహ‌న్‌ను చంపేసిందా! (video)
, మంగళవారం, 25 మే 2021 (15:00 IST)
chandramohan family
చేసిన‌న్నాళ్ళు హాయిగా సినిమాలు చేసుకుని ఇక చేయాల‌ని అనిపించ‌క‌ సినిమాలు చేయ‌కుండా  ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్న చంద్ర‌మోహ‌న్ ఇటీవ‌లే త‌న 80వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సెలెక్టెడ్ మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. అప్ప‌టివ‌ర‌కు ఆయ‌న హైద‌రాబాద్‌లో హాయిగా వున్నార‌ని అనుకుంటున్నారు. ష‌డెన్‌గా పుట్టిన‌రోజు ఇంట‌ర్వ్యూలో త‌న ఆరోగ్యం స‌రిగా లేద‌నీ, జువ్వాడ జ‌గ‌న్నాథం సినిమా షూటింగ్‌లోనే ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క మ‌ధ్య‌లోనే త‌ప్పుకున్నాన‌ని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
 
ఆ త‌ర్వాత త‌న‌కు బైపాస్ కూడా జ‌రిగింంద‌ని త‌న వివ‌రాలు ఎవ్వ‌రికీ, ఎప్ప‌డూ చెప్ప‌ని ఆయ‌న కొద్దిమంది మీడియా ముందుకు వ‌చ్చి చెప్పాడు. ఇదంతా బాగానే వుంది. అయితే మంగ‌ళ‌వారంనాడు చంద్ర‌మోహ‌న్ చ‌నిపోయార‌ని చెన్నైకు చెందిన ఓ వ్య‌క్తి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. దాంతో అది వైర‌ల్‌గామారి హైద‌రాబాద్ వ‌ర‌కు పాకింది. హైద‌రాబాద్‌లో మీడియా దాన్ని క‌న్‌ఫార్మ్ చేసుకోవ‌డానికి చంద్ర‌మోహన్‌ను సంప్ర‌దించారు. దాంతో ఆయ‌న బ‌తికుండ‌గానే న‌న్ను చంపేశారా! అంటూ కాస్త అస‌హ‌జ‌నం వ్య‌క్తం చేశారు. అన‌వ‌స‌రంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చానా అంటూ న‌సిగారు. అలా కాద‌ని కొంద‌రు చెప్ప‌డంతో, ఏకంగా చిన్న వీడియో బైట్ ఇచ్చి. నేను బ‌తికే వున్నా. నామీద మీరు చూపిస్తున్న ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు అంటూ వివ‌రించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తేనె టీగ‌ల‌కు బాడీని అప్ప‌గించిన ఏంజెలీనా జోలీ