Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ మహేష్

Webdunia
గురువారం, 14 మే 2020 (20:05 IST)
జబర్దస్త్ కామెడీ షోతో బాగా ఫేమస్ అయిన కమెడియన్‌లలో ఒకరైన మహేష్ పెళ్లి పీటలెక్కాడు. లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి హంగులు, హడావిడి లేకుండా నిరాడంబరంగా పెళ్లి చేసుకొన్నాడు. 
 
జబర్దస్త్‌లో కిరాక్ ఆర్పీ టీమ్‌లో మెయిన్ కంటెస్టెంట్‌గా ఉన్న మహేష్ తన పంచులతో ప్రజలను ఆకర్షించడంతో పాటుగా అనేక స్కిట్‌లను విజయవంతం చేసారు. అక్కడి నుండి బుల్లితెరకు, ఆ తర్వాత వెండితెరకు ప్రయాణం సాగింది. ఇటీవల మహేష్ నటించిన శతమానం భవతి, రంగస్థలం, గుణ 369 చిత్రాలలో అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి.
 
ఇలా కెరీర్ బాగుంటుండగా మహేష్ వివాహం పావనితో మే 14వ తేదీ ఉదయాన తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామంలో వధువు ఇంటి వద్ద కేవలం కొద్ది మంది బంధువుల సమక్షంలో జరిగింది. పెళ్లిలో కూడా లాక్‌డౌన్ నిబంధనలు పాటించేలా, అదే సమయంలో సాంప్రదాయాలను పాటించేలా జాగ్రత్తపడ్డారు. 
 
శానిటైజర్, మాస్కులు వంటి ఏర్పాట్లన్నీ కట్టుదిట్టంగా ఫాలో అయ్యారు. అయితేఈ వేడుకకు తెలుగు టెలివిజన్, సినీ తారలు, ప్రముఖులు ఎవరూ లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా పెళ్లికి హాజరు కాలేదు, అంతా ఫోన్ ద్వారా మరియు సోషల్ మీడియాలో మహేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments