Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ నరకాన్ని నాకు చూపించారు, జబర్దస్త్ ఫేమ్ సాయితేజ

Advertiesment
Jabardasth
జబర్దస్త్‌లో నటించిన చాలామంది ఇప్పటికే ఫేమస్ అయిపోయారు. కొంతమంది వెండితెర మీదకు వెళ్ళిపోతే మరికొంతమంది వేరే ఛానళ్ళకు షిప్ట్ అయిపోయారు. రకరకాల కారణాలతో చాలామంది జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. 
 
అయితే అందులో స్కిట్స్ చేసిన చాలామందిని ఇప్పటికీ జబర్దస్త్ పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. అందులో ఒకరు సాయితేజ. మగాడు అమ్మాయిగా మారిపోయిన సాయితేజ. ఆమె అసలు పేరు ప్రియాంకా సింగ్. ఈ పేరు చాలామందికి తెలియదు.
 
క్యారెక్టర్లో మాత్రమే ఆమె సాయితేజ. ప్రస్తుతం లాక్‌డౌన్లో ఇంట్లో ఉన్న ప్రియాంకా తాను గతంలో ఎదుర్కొన్న సమస్యలను వివరించింది. ఆరు సంవత్సరాల్లోనే నేను అమ్మాయిగా మారిపోయాను. మా అక్క బట్టలు వేసుకుని తిరిగాను. మా తల్లిదండ్రులకు అలా ఉండటం ఇష్టం లేదు. 
 
కానీ నేను నా టాలెంట్‌తో చేసిన కొన్ని షోలు హిట్టవ్వడం.. డబ్బులు రావడంతో ఆ డబ్బులతోనే నేను అమ్మాయిగా మారిపోయాను. నాకు ఎవ్వరూ ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. కానీ అబ్బాయి అమ్మాయిగా మారితే ఎంత కష్టమో నాకు అప్పుడు అర్థమైంది.
 
నాకు ఇష్టం వచ్చినట్లు నేనుంటే తప్పేముంది. కానీ నన్ను చాలామంది హేళనగా మాట్లాడుతూ ప్రత్యక్ష నరకాన్ని చూపించారు. ఒకానొక దశలో చచ్చిపోవాలనుకున్నా. కానీ నా స్నేహితులే నాకు అండగా నిలిచారు. ఇప్పుడు సాయితేజ అంటే ఒక క్రేజ్. ఒక గౌరవం. ఇది చాలు నాకు అంటోంది ప్రియాంకా సింగ్. ప్రస్తుతం ఆమె అదిరింది షోకి షిప్ట్ అయిపోయింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ రికార్డు సృష్టించిన రామానంద సాగర్ 'రామాయణం'