Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తగిన అమ్మాయిని వెతుకుతున్నానంటున్న 'వినోదిని'

Advertiesment
తగిన అమ్మాయిని వెతుకుతున్నానంటున్న 'వినోదిని'
, శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (20:09 IST)
జబర్దస్త్‌లో ఆర్టిస్టుల గురించి అస్సలు పరిచయం అక్కర్లేదు. యాంకర్ స్కిట్‌కు సంబంధించి పేర్లు చెప్పకుండానే ప్రేక్షకులే పిలిచేస్తుంటారు. అబ్బా.. గెటప్ శ్రీను ఏం చేశాడబ్బా.. సుడిగాలి సుధీర్ అదరగొట్టాడయ్యా.. ఇలా ప్రేక్షకులే మాట్లాడేసుకుంటుంటారు. అలా బాగా ఫేమస్ అయిపోయారు కమెయడిన్లు.
 
అయితే ఇందులో ఎప్పుడూ వివాదాల్లో ఉండే వినోద్, అదే వినోదిని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే ఆ గెటప్ అలాంటిది. అబ్బాయి అమ్మాయి వేషం వేస్తే సాధారణంగానే మనకి చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ వినోద్ వేషం వేస్తే మాత్రం అచ్చం అమ్మాయిలాగే ఉంటాడు.
 
అలా వినోద్ కాస్త వినోదినిలా బాగా పాపులర్ అయ్యాడు. అయితే మొదటి నుంచి వినోద్ వివాదాల్లో నిలుస్తున్నాడు. మొదట్లో తల్లిదండ్రులు అతనికి పెళ్ళి చేయాలనుకుంటే అతను ఆత్మహత్యయత్నం చేశాడట. అప్పుడు కాస్త పెళ్ళి ఆగిపోయింది. ఆ తరువాత కొన్నిరోజులకు ఇంటి ఓనర్ దాడి చేశాడని మీడియాలో వార్తలు వచ్చాయి.
 
ఇది కాస్త బాగా వైరల్ అయ్యింది. ఆ దాడిలో గాయపడ్డ వినోద్ కొన్నిరోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ తరువాత కోలుకున్నాడు. మళ్ళీ జబర్దస్త్‌కు వెళ్ళాలని అనుకుంటున్నా షూటింగ్ ఆగిపోవడంతో ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అయితే తను పెళ్ళి చేసుకోవాలని ఎప్పుడో అనుకున్నానని.. కానీ తన ఇంటి యజమాని అనవసరంగా దాడి చేయడం వల్ల తన పెళ్ళి ఆగిపోయిందని చెబుతున్నాడట. మళ్ళీ అమ్మాయిలను వెతికే పనిలో ఉన్నానని.. త్వరలోనే ఒకింటి వాడినవుతానని చెబుతున్నాడట వినోద్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో.. రజనీ ప్రీమియర్ వైరల్ ప్లస్ రికార్డ్