సుడిగాలి సుధీర్‌కు అది కలిసిరాలేదే.. ఇకనైనా కుదురుకుంటాడా?

గురువారం, 9 ఏప్రియల్ 2020 (20:32 IST)
జబర్దస్త్ కామెడీ యాక్టర్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై మంచి క్రేజ్ వచ్చిన సుడిగాలి సుధీర్‌కు వెండితెర అంతగా కలిసిరాలేదు. అంటే హీరోగా సుడిగాలి సుధీర్‌కు కలిసిరాలేదు. కానీ కమెడియన్‌గా రాణించాడు. ఇటీవల హీరోగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. సుడిగాలి సుధీర్‌ హీరోగా, ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌'. 
 
శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు ఈ చిత్రాన్నినిర్మించారు. మంచి సందేశంతో ఆద్యంతం వినోదాత్మకంగా ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సాఫ్ట్‌‌వేర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో కథ నడుస్తుంది. ఫుల్‌ లెంగ్త్‌ కామెడీతో పాటు ఎమోషన్స్‌తో సినిమా ఆద్యంతం అలరించే విధంగా రూపొందించారు. కానీ ఈ సినిమా సుధీర్‌కు అంతగా గుర్తింపునివ్వలేదు. 
 
ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద బోల్తా పడింది. ఈ చిత్రాన్ని స్టార్ మా ఛానెల్లో ఈ ఏప్రిల్ 10 శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం చేయనున్నట్టు తెలుస్తుంది. మరి తొలి సినిమా సుధీర్‌కు కలిసిరాకపోవడంతో మళ్లీ అతడు హీరోగా నటిస్తాడా లేదా అనేది అనుమానంగా మారింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్దే, అదిరిపోతుందట...