Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెక్కల మాస్టారు ఫోక్ సాంగ్ "ఆ గట్టునుంటావా" వీడియో సాంగ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్‌గా మ్యాథ్స్ టీచర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం గత మార్చి నెలాఖరులో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌ సాధించింది. పైగా, కలెక్షన్ల వర

Webdunia
మంగళవారం, 8 మే 2018 (11:18 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్‌గా మ్యాథ్స్ టీచర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం గత మార్చి నెలాఖరులో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌ సాధించింది. పైగా, కలెక్షన్ల వర్షం కురిపించింది. 1985 కాలం నాటి నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఇప్పటికే రూ.200 కోట్ల వ‌సూళ్ళు సాధించి ఔరా అనిపించింది. ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
 
ఈ చిత్రంలో చిట్టిబాబుగా రామ్ చ‌ర‌ణ్‌, రామ‌ల‌క్ష్మీగా స‌మంత, రంగమ్మత్తగా అనసూయ అద‌రగొట్ట‌గా జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాశ్ రాజ్, ఆది పినిశెట్టి ముఖ్య పాత్ర‌లలో కనిపించి అల‌రించారు. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించి వీడియో సాంగ్స్ విడుద‌ల చేస్తూ వ‌స్తున్న మేక‌ర్స్ తాజాగా "ఆ గ‌ట్టునుంటావా" అనే ఫోక్‌ సాంగ్‌ని రిలీజ్ చేశారు. 
 
ఆడియో ఆల్బ‌మ్‌లో జాన‌ప‌ద క‌ళాకారుడు శివ‌నాగులు గొంతుతో ఈ పాట వినిపించ‌గా, మూవీలో దేవిశ్రీ ప్ర‌సాద్ పాడి వినిపించారు. ఈ పాటకు అద్భుతమైన స్పందన వచ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రి తాజాగా విడుద‌లైన ఆ సాంగ్ ఎలా ఉందో ఓసారి మీరూ చూడండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments