Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక సాయం చేయ‌మ‌ని అభ్య‌ర్థిస్తున్న రానా

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (13:40 IST)
Rana-1
కొన్ని విప‌త్క‌ర ప‌రిస్థితులు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌నుంచి ఆర్థిక సాయాన్ని కోరుతుంది. కానీ ప్రైవేట్ వ్య‌క్తులు కూడా త‌మ వంతు సాయంగా ప్ర‌జ‌ల‌కు సాయం చేస్తూనే వున్నారు. ఇప్పుడు క‌రోనా సెకండ్‌వేవ్ వ‌ల్ల ఎంతో మంది అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఆక్సిజ‌న్‌, ఆహారం, వైద్య సదుపాయం అంద‌డంలేదు. అందుకే త‌మ వంతు ఉదార‌త‌గా  ఫ్రమ్ యు టు దెమ్, ఓఆర్ కైండ్ నెస్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థలు వీటి కోసం కృషి చేస్తున్నారు. 
 
అలాంటి సంస్థ‌ల‌కు సాయం చేస్తే కొంత‌మందికైనా ఉప‌శ‌నం క‌లుగుతుంద‌ని ద‌గ్గుబాటి రానా సోష‌ల్‌మీడియాలో అభ్య‌ర్థిస్తున్నారు. ఆ సేవా సంస్థలు బాధితులకు ఆక్సిజన్, ఆహారం, వైద్య సదుపాయాలను అందిస్తోంది. ఆ సంస్థకు తోచిన రీతిలో ఆర్థిక సాయం చేయమంటూ రానా సోషల్ మీడియా వేదికగా అభిమానులను కోరుతున్నాడు.
 
ఇదిలా వుండ‌గా, ఇప్ప‌టికే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ వైజాగ్‌లోని త‌మ స్టూడియోను కోవిడ్ పేషెంట్ల‌ను ట్రీట్ చేస్తున్న డాక్ట‌ర్ల‌కు అసొలేష‌న్ రూమ్స్‌గా మార్చింది. కొంత‌కాలం మా స్టూడియోను వారు వినియోగించుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. ఇప్పుడు రానా కూడా త‌న వంతు సాయంగా ముందుకు వ‌చ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments