Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సుబ్రహ్మణ్యపురం'లో ‘‘భళ్లాల దేవుడు’’

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (18:47 IST)
సుబ్రహ్మణ్యపురం మూవీలో హీరో రానా సందడి చేయబోతున్నాడు. అయితే ఇందులో ఆయన నటించడం లేదు..కాకపోతే రానా వాయిస్ సినిమా అంతా వినిపించబోతుంది.. ఈ ‘‘సుబ్రహ్మణ్యపురం’’ కథను నడిపించడంలో ఆ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ బలమైన పాత్రను పోషించనుందట. ‘‘సుబ్రహ్మణ్యపురం’’  కీలక సన్నివేశాలకు రానా వాయిస్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ రానాను సంప్రదించింది. దానికి ఆయన వెంటనే అంగీకారం తెలిపారు. 
 
దర్శకుడు సంతోష్ జగర్లపూడి పర్యవేక్షణలో రానా కొన్ని కీలక సన్నివేశాలకు వాయిస్ నిచ్చారు. ఈ చిత్రం కాన్సెప్ట్‌ని తెలుసుకొని ఎగ్జైట్ అయ్యారు. కంటెంట్ ఉన్న సినిమాలలో భాగం అయ్యే టాలీవుడ్ హల్క్ రానాకు ‘‘సుబ్రహ్మణ్యపురం’’ ట్రైలర్ కూడా బాగా నచ్చింది.
 
 ‘‘సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్’’ పతాకంపై బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ‘‘సుబ్రహ్మణ్యపురం’’ చిత్రం డిసెంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. భగవంతుడి ఉనికి అనేది నమ్మకం అనే పునాదుల మీద ఉంటుంది. ఆ నమ్మకం లేని వ్యక్తి భగవంతుడిపై చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి.
 
కాపాడవలసిన భగవంతుడి ఆగ్రహాం తట్టుకోవడం సాధ్యం అవుతుందా..? ‘‘సుబ్రహ్మణ్యపురం’’లో దాగున్న రహాస్యం ఏంటి..? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రం ‘‘సుబ్రహ్మణ్యపురం’’. విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే  ‘‘సుబ్రహ్మణ్యపురం’’ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌గా మారింది. ఇప్పటికే హిందీ శాటిలైట్, ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్‌లు పూర్తి అయ్యాయి. బాహుబలి, గరుడ వేగ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన టీం ‘‘సుబ్రహ్మణ్యపురం’’కు వర్క్ చేసారు. లెజండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం పాడిన థీమ్ సాంగ్ హైలెట్‌గా నిలుస్తుంది. సెన్సిబుల్ హీరో సుమంత్, ఇషా రెబ్బ జంటగా నూతన దర్శకుడు సంతోష్ జాగర్లపూడి రూపొందించిన ఈ మూవీ ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments