శుభకార్యాలతో పాటు పితృపక్ష దినాలు, తమ పుట్టిన రోజుల్లో కొందరు వివిధ రకాల సహాయాలు చేస్తుంటారు. ముఖ్యంగా, సత్కర్మలు, సమాజానికి ఉపయోగపడే కార్యాలు చేస్తుంటారు. ఇలా చేసేవారు శాశ్వత కీర్తిని పొందుతారని మన పురాణాలు, ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
ఇలాంటి సత్కార్యాల్లో బావులు, చెరువుల తవ్వకాలు, తోటలు, వనాల పెంపకాలు, గుళ్లు, గోపురాలు, సత్రాల నిర్మాణాలు, వైద్యశాలలు, విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం వంటివి అనేకం ఉన్నాయి.
ఇలాంటి మంచి పనులు చేసిన వారితోపాటు నీతి తప్పని రాజు, ధర్మనిరతిని పాటించే పౌరులు, ధర్మయుద్ధంలో వెనుకడుగు వేయని జవాన్లు, సత్సంతానం కలిగిన వారు తదితరులంతా ఏదో రీతిన శాశ్వత కీర్తిని పొందుతారు.