Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా - మిహీకా ఎంగేజ్‌మెంట్... ఇట్స్ అఫిషియల్..! (video)

Webdunia
గురువారం, 21 మే 2020 (13:59 IST)
రానా- మిహీకా
దగ్గుబాటి రానా - మిహీకా బజాజ్‌తో ప్రేమలో ఉన్నానని.. త్వరలో ఒకటి కానున్నాం అంటూ ఇటీవల రానా ట్విట్టర్ ద్వారా తెలియచేసిన విషయం తెలిసిందే. ఈవిధంగా రానా చెప్పడంతో హాట్ టాపిక్ అయ్యింది. ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఇది షాకే అని సురేష్ బాబు స్పందించారు. ఆ తర్వాత డిసెంబర్‌లో రానా - మిహీకా పెళ్లి జరగనుందని వార్తలు వచ్చాయి. 
 
అయితే... ఈ రోజు రానా - మిహీకా నిశ్చితార్థం అని నిన్న వార్తలు వచ్చాయి. అయితే... ఆ వార్తలను సురేష్‌ బాబు ఖండించారు. కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మీటింగ్ మాత్రమే అన్నారు. దీంతో అంతా నిజమే అనుకున్నారు అయితే.. ఈరోజు రానా - మిహీకా నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని కూడా రానా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియచేస్తూ... ఓ ఫోటో పోస్ట్ చేసి ఇట్స్ అఫిషియల్ అని అసలు విషయం చెప్పకనే చెప్పేసాడు. 
 
రానా పోస్ట్ చేసిన ఫోటో చూసి జంట చూడచక్కగా ఉన్నారు అంటూ సోషల్ మీడియా ద్వారా ఈ జంటను సినీ ప్రముఖులు దీవిస్తున్నారు. అభినందనలు తెలియచేస్తున్నారు. పెళ్లి కూతురు మిహీకా బజాజ్ విషయానికి వస్తే... ఈమె  హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే. బంటీ బజాజ్, సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె మిహికా. 
 
చెల్సియా వర్సిటీ నుంచి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందింది. డ్యూ డ్రాప్ డిజైన్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ లో పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ వార్తల పై కూడా రానా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments