రానా ప్రేమ ఫలించింది.. ప్రేయసి ''యస్'' చెప్పేసింది.. పిక్ వైరల్

Webdunia
మంగళవారం, 12 మే 2020 (18:01 IST)
Rana Daggubati
బాహుబలి భల్లాలదేవుడు ఓ ఇంటివాడు కానున్నాడు. రానా మిహికా బాజాజ్ అనే అమ్మాయిని వివాహం చేసుకోనున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఇంకా రానానే స్వయంగా ఆమె పెళ్లిచేసుకోబోతున్న యువతిని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశాడు. దీంతో రానాను సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రానా పోస్టు చేసిన ఫోటోకు 15 నిమిషాల్లోనే 50 వేల లైక్స్ వచ్చాయి.
 
తన ప్రేమను మిహికా బజాజ్‌ అంగీకరించిందని చెప్పిన రానా.. ఈ సందర్భంగా తన ప్రేయసితో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో ముందున్న రానా దగ్గుబాటి ఎట్టకేలకు పెళ్లి చేసుకుంటున్నట్లు వెల్లడించాడు.
 
దీంతో సినీ ప్రముఖలతో పాటుగా, అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సమంత, ఉపాసన, తమన్నా, నిఖిల్‌, అల్లు శిరీష్‌, నిహారిక, సుషాంత్‌, రాశి ఖన్నా, శృతిహాసన్‌.. ఇలా పలువురు సినీ ప్రముఖులు ఇన్‌స్టా వేదికగా రానాకు శుభాకంక్షలు తెలిపారు. 
 
కాగా, మిహీక వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రితకు మంచి స్నేహితురాలని సమాచారం. మిహికా బాజాజ్ ఈవెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే, గతంలో రానా పలువురితో ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వచ్చినప్పటికీ.. అవన్నీ వదంతులుగానే మిగిలిపోయాయి. తాజాగా రానా చేసిన ప్రకటనతో దగ్గుబాటి అభిమానులు సంబరపడిపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

బీహార్‌లో ఘోర పరాజయం.. రాజకీయాలకు బైబై చెప్పనున్న ప్రశాంత్ కిషోర్?

మావోయిస్టుల మాట విని యువత చెడిపోవద్దు : బండి సంజయ్ హితవు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments