Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్ట‌కేల‌కు రామ్ సినిమా ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (16:22 IST)
సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న చిత్రం ఖరారైంది. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘రెడ్‌’ అనే టైటిల్‌ ప్రకటించారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ చిత్రం టైటిల్‌ని, ఇందులో హీరో రామ్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిషోర్‌ మాట్లాడుతూ ”ఇప్పటి వరకూ రామ్‌ చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా ఉంటుంది. రామ్‌ – తిరుమల కిషోర్‌ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ విజయాల తర్వాత వాళ్లిద్దరి కాంబినేషన్‌లో మళ్లీ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. 
 
మా సంస్థలో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ పనిచేయడం ఇదే తొలిసారి. నవంబర్‌ 16 నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే తెలియజేస్తాం” అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: కృష్ణ పోతినేని, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్ : పీటర్ హెయిన్స్ ,ఎడిటింగ్‌: జునైద్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments