Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు మాత్ర‌మే చెప్తా సెన్సార్ టాక్ ఏంటి..?

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (16:05 IST)
విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్ “కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్” పతాకంపై రూపొందిన సినిమా “మీకు మాత్రమే చెప్తా”. ఈ మూవీకి ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెన్సార్ సభ్యులు ‘మీకు మాత్రమే చెప్తా’ టీంను అభినందించారు.
 
న్యూఎజ్ ఫన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ‘మీకు మాత్రమే చెప్తా’కు రిలీజ్‌కు ముందు పరిశ్రమలోనూ, ప్రేక్షకులలోనూ అటెన్షన్‌ని క్రియేట్ చేసింది. టీజర్, ట్రైలర్‌తో పాటు విజయదేవరకొండ చేసిన ప్రమోషనల్ వీడియో సాంగ్ ‘నువ్వే హీరో’కు మంచి రెస్సాన్స్ అందుతుంది.
 
 ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ: ‘సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, సెన్సార్ సభ్యులు నుండి మంచి రెస్సాన్స్ వచ్చింది. సినిమా నిర్మాణంలో అడుగుపెట్టిన మాకు మొదటి సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’ చాలా స్పెషల్‌గా నిలుస్తుంది. 
 
కొత్త తరహా ఆలోచనలను ప్రొత్సహించేందుకు “కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్ టైన్మెంట్” ఎప్పుడూ ముందు ఉంటుంది. ఈ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందన్న నమ్మకం మాకు ఉంది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్‌గా ‘మీకు మాత్రమే చెప్తా’ నిలుస్తుంది’ అన్నారు.
 
 నవంబర్ 1న రిలీజ్ అవుతున్న“మీకు మాత్రమే చెప్తా”లో తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్‌తో పాటు అభినవ్ గౌతమ్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments