Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామిలీపై ఆర్జీవీ వివాదాస్ప‌ద ట్వీట్‌.. అందరూ పరాన్న జీవులే !

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:12 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎప్పుడు ఏదో ట్వీట్‌ చేసి… వార్తల్లో నిలుస్తుంటారు. అయితే… తాజాగా వర్మ మెగా ఫ్యామిలీ‌పై దృష్టిపెట్టారు. అల్లు అర్జున్‌ ఒక్కడే రియల్‌ మెగాస్టార్‌ అని.. పవన్‌ కళ్యాణ్‌ - రామ్‌ చరణ్‌ సహా ఇతర మెగా హీరోలందరూ పరాన్న జీవులేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
ఆదివారం మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా హీరోలంతా సెలబ్రేషన్స్‌‌లో పాల్గొన్నారు. కానీ, పుష్ప షూటింగ్‌లో ఉన్న బన్నీ మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రామ్‌ గోపాల్‌ వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
'శ్రీ మెగా చిరంజీవి మెగా సక్సెస్‌ వల్ల నిలబడిన వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌, నిహారిక వంటి తక్కువ స్థాయి పరాన్న జీవులతో పోలిస్తే.. ఈ రోజు అల్లు అర్జున్‌ ఒక్కడే నిజమైన మెగాస్టార్‌. నేను వారిని పరాన్న జీవులు అని ఎందుకు పిలుస్తున్నానంటే వారందరూ చిరంజీవి ద్వారా మాత్రమే మనుగడ సాగిస్తున్నారు. కానీ అల్లు అర్జున్‌ ఎవరి మీద ఆధారపడలేదు.. కాబట్టి అతను మాత్రమే నిజమైన మెగాస్టార్‌' అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్‌ పెద్ద దుమారం రేపుతోంది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రా ప్రజలకు మండుతుంది.. జగన్ పేర్లు తొలగిపోతున్నాయ్...

అన్నదాత సుఖీభవగా పేరు మార్చుకున్న రైతు భరోసా పథకం

తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం- హై అలెర్ట్

తిరుమల: సర్వదర్శనానికి 16 గంటలు.. హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు

ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన సుధా నారాయణ మూర్తి.. కలాం ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అని చెప్పా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments