Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

జో బైడెన్ మీద ఒట్టేసి చెబుతున్నా.. ఆ వ్యక్తిని నేను కాదు : ఆర్జీవీ

Advertiesment
Ram Gopal Varma
, సోమవారం, 23 ఆగస్టు 2021 (19:31 IST)
టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల బిగ్‌బాస్‌ భామలు ఆరియాన, అషురెడ్డిలతో చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య ఆయన ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఆరియానతో బోల్డ్‌ ఇంటర్య్వూ చేశారు. 
 
అషురెడ్డిని డిఫరెంట్‌ యాంగిల్‌లో ఫొటో తీసి వార్తల్లోకి ఎక్కించారు. తాజాగా మరో అమ్మాయితో బర్త్‌డే పార్టీలో హంగామా చేసి సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌ అయ్యారు. ఇందులో ఆర్జీవీ చేసిన రచ్చ అంతాఇంతా కాదు. దీంతో 'ఇది ఆయనకేం కొత్త కాదుగా, అమ్మాయిలు, హీరోయిన్లతో రచ్చ చేయడం ఆయనకు మామూలే' అని నెటిజన్లు ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారు. 
 
దీంతో ఆర్జీవీ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'మీ అందరికి ఓ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి నేను కాదు. ఆ రెడ్‌డ్రెస్‌లో ఉన్న అమ్మాయి ఇనయా సుల్తానా అసలే కాదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మీద ఒట్టు' అంటూ తనదైన స్టైల్‌లో వివరణ ఇచ్చారు. 
 
కాగా ఈ వీడియోలో వర్మ 'రంగీలా' మూవీలోని పాటకు ఇనయాతో కలిసి స్టెప్పులు వేశారు. అంతేగాక మధ్యలో ఆమె కాళ్లు పట్టుకున్నారు. ఇదిలావుంటే, ఇనయా సుల్తానా ఆర్జీవీ కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందంతో పిచ్చెక్కిస్తున్న అనుపమ..