Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరి జగన్నాథ్‌కు గురించి షాకిచ్చిన వర్మ

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (17:16 IST)
పూరీ జగన్నాథ్... తెలుగు సినీ ప్రేక్షకులు ఎవరికైనా పరిచయం చేయవలసిన అవసరం లేని పేరు. కాగా సదరు దర్శకుడి గురించి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడిస్తూ... దానికి సంబంధించిన వీడియోని కూడా తన ట్విట్టర్‌లో షేర్ చేసాడు.
 
వివరాలలోకి వెళ్తే.. పూరీ జగన్నాథ్ దర్శకుడిగా అందరికీ తెలిసిన వ్యక్తే కానీ ఆయన దర్శకత్వానికి రాక మునుపు ఒక సూపర్ హిట్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేసారు. ఇక ఆ సినిమా విషయానికి వస్తే అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన శివ... ఆ సినిమా బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసేయడంతోపాటు అటు హీరో నాగార్జునకి, ఇటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ఎంత పేరు తెచ్చి పెట్టిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో కాలేజ్ బ్యాక్ గ్రౌండ్‌లో సాగే ‘బోటనీ పాటముంది.. మేటినీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా..’ అనే ఫేమస్ సాంగ్‌కి పూరీ జూనియర్ ఆర్టిస్ట్‌గా స్టెప్పులు వేసారు. 
 
తాజాగా ఈ పాటను ట్విట్టర్‌లో షేర్ చేసిన వర్మ.. 'బ్లూ షర్ట్‌లో కనిపించే జూనియర్ ఆర్టిస్ట్ నేటి మేటి దర్శకుడు పూరీ జగన్.. హే పూరీ జగన్ వాట్ ఏ జర్నీ' అంటూ ట్వీట్ చేయగా... దీనికి పూరీ కూడా 'ఎస్ సార్' అంటూ రిప్లై ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments