Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారక్‌ను ఉద్దేశిస్తూ రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (14:50 IST)
ఎప్పుడూ వివాదాలలో మునిగి తేలుతూ ఉండే రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ఎన్నికలపై పడ్డారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లతో చెలరేగిపోతున్న వర్మ తాజాగా ముగిసిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా పరాజయం పొందడాన్ని గుర్తు చేస్తూ తారక్‌ను ఉద్దేశించి వరుస ట్వీట్‌లు చేయగా అవి వైరల్‌గా మారాయి.
 
ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండి పరోక్షంగా జగన్‌కు మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు, లోకేశ్‌లపై వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ఇక ప్రత్యక్షంగా ఏ రాజకీయ సభలలోనూ పాల్గొనని వర్మ గురువారం ఘనంగా జరిగిన వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 
 
ఇక ప్రమాణస్వీకారం ముగిసిన వెంటనే మళ్లీ ట్వీట్‌ల బాట పట్టారు వర్మ. ఈ ట్వీట్‌లలో టీడీపీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ చేతికి అప్పగించాలని, 2019 ఎన్నికలలో జరిగిన ఈ ఘోర పరాభవాన్ని ప్రజలు మర్చిపోయేలా ఆయన మాత్రమే చేయగలరని సూచించారు.

టీడీపీని తిరిగి నిలబెట్టే సత్తా కేవలం తారక్‌కి మాత్రమే ఉందని, తన తాత పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా ఎన్టీఆర్ వెంటనే టీడీపీ పగ్గాలను చేపట్టాలని ట్వీట్ చేసారు వర్మ.
 
చివరిగా చేసిన ట్వీట్‌లో ''తారక్ నిన్ను అభ్యర్థస్తున్నా.. దయచేసి మీ బాబాయ్ దారిలో వెళ్లొద్దు. మీ తాతకు అల్లుడు పొడిచిన వెన్నుపోటు కంటే మీ బాబాయ్ పొడిచినదే పెద్దది'' అంటూ పరోక్షంగా బాలయ్యపై కామెంట్లు విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments