Publish Date: Thu, 30 May 2019 (16:11 IST)
Updated Date: Thu, 30 May 2019 (16:15 IST)
మల్లె పువ్వులు అలంకరణ కోసం మాత్రమే కాకుండా మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. మల్లె పువ్వుల టీ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. దీన్ని త్రాగితే వృద్ధాప్య లక్షణాలు దరిచేరవు. అంతేకాకుండా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లు వచ్చే అవకాశాల నుండి రక్షిస్తుంది. రాత్రిళ్లు కలత లేకుండా నిద్రపట్టాలంటే పడుకునే ముందు కప్పు మల్లె టీని తీసుకోండి.
ఇందులో జలుబు, జ్వరం వంటి సమస్యల్ని నివారించే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇందులోని కాచెన్స్ అనే గుణాలు జీవక్రియల వేగాన్ని పెంచి ఎక్కువ క్యాలరీలు కరిగేలా చేస్తాయి. మల్లె పరిమళం ఒత్తిడిని దూరం చేస్తుంది. ఎక్కువగా పని చేసి అలసటగా ఉన్నప్పుడు ఈ నూనెను వాసన చూస్తే ఉపశమనం కలుగుతుంది.
చర్మ రక్షణకు మల్లె ఎంతగానో దోహదపడుతుంది. ఈ నూనె చర్మానికి తేమను అందిస్తుంది. అంతేకాకుండా చర్మంలోని సాగే గుణాలను పెంచుతుంది. దాంతో చర్మం తాజాగా పొడిబారకుండా ఉంటుంది. చర్మంపై ఏర్పడే రకరకాల మచ్చలను ఈ మల్లె నూనె నివారిస్తుంది.
సందీప్
Publish Date: Thu, 30 May 2019 (16:11 IST)
Updated Date: Thu, 30 May 2019 (16:15 IST)