విశాఖపట్టణం విమానాశ్రయంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తితో చేసిన దాడి ఓ యాక్సిడెంటల్ అని కోడికత్తి దాడి కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ వెల్లడించాడు. కేసులో అతనికి బెయిల్ లభించడంతో రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను ప్రాణాలతో ఉన్నానంటే అది జగన్ మోహన్ రెడ్డి కారణమన్నారు. ముఖ్యంగా, జగన్‌పై దాడి చేయాలన్న ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదని చెప్పాడు.
తాను జగన్‌కు వీరాభిమాని అని.. ఆయనకు ఓ లేఖ ఇద్దామని వెళ్ళగా, కత్తి తగిలి ఆయన భుజానికి గాయమైందన్నాడు. నిజంగా చెప్పాలంటే ఇది ఓ యాక్సిడెంటల్ అని శ్రీనివాస్ వెల్లడించాడు. పైగా, జగన్‌ది జాలి గుండె అని, దాడి సమయంలో తనను కొట్టకుండా అడ్డుకున్నాడని శ్రీనివాస్ చెప్పాడు.