Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీకింకా బుద్దిరాలేదా సుమంత్... నీ ఖర్మ.. ఆ పవిత్ర ఖర్మ : రాంగోపాల్ వర్మ

Webdunia
గురువారం, 29 జులై 2021 (09:54 IST)
టాలీవుడ్ హీరో సుమంత్‌పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మండిపడ్డారు. నీకింగా బుద్ధిరాలేదా సుమంత్ అంటూ సెటైర్లు వేశారు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా 'నీకింకా బుద్దిరాలేదా సుమంత్'.. అంటూ కామెంట్ చేశాడు. 
 
నాగార్జునతో 'శివ' సినిమా తీసినప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉన్న వర్మ, 'ప్రేమకథ' చిత్రంతో సుమంత్‌ని హీరోగా టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. ఆ రకంగా సుమంత్‌తో కూడా చనువుగా ఉంటాడు. అయితే తాజాగా సుమంత్ రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. 
 
పవిత్ర అనే అమ్మాయితో తన పెళ్ళి జరగబోతుండగా, దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఇరువైపుల వారు.. అత్యంత సన్నిహితులకు, బంధు, మిత్రులకి 'SP' అనే అక్షరాలు హైలెట్ అయ్యేలా డిజైన్ చేసిన వెడ్డింగ్ కార్డ్స్ అందజేచేసి పెళ్ళికి ఆహ్వానించారు. 
 
ఈ నేపథ్యంలో సుమంత్ పెళ్ళిపై రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. "ఒక్కసారి అయ్యాకా కూడా నీకింకా బుద్ది రాలేదా సుమంత్, నీ ఖర్మ.. ఆ పవిత్ర ఖర్మ" అని రాసుకొచ్చారు. దీనికి ఓ ఏమోజీని జత చేశారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ మరోసారి హాట్ టాపిక్ అయింది. 
 
అయితే వర్మ సుమంత్‌పై ఉన్న అభిమానం, చనువుతోనే ఇలా సరదాగా కామెంట్ చేశాడని చెప్పుకుంటున్నారు. కాగా 'తొలిప్రేమ' చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్ కీర్తిరెడ్డిని 2004లో సుమంత్ వివాహం చేసుకున్నారు. తర్వాత వారిద్దరి మధ్య గొడవలు జరిగి 2006లో విడాకులు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments