Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పనిని ఏ పిచ్చివాడైనా చేస్తాడా? 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్‌పై వర్మ కామెంట్స్

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (20:06 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం "వకీల్ సాబ్". 'అజ్ఞాత వాసి' చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో 'వకీల్ సాబ్‌'పై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. తాజాగా వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ కావడంతో పవర్ స్టార్ మేనియాతో ట్విట్టర్ ఊగిపోతోంది.​ దీనిపై టాలీవుడ్ సెలెబ్రిటీలు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. అలాంటి వారిలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఒకరు. 
 
వర్మ తనదైన శైలిలో కౌంటర్ పోస్టు చేశారు. వకీల్ సాబ్‌కు ప్యారడీగా డైరెక్టర్ సాబ్ అంటూ ఓ పిక్‌ను రిలీజ్ చేశారు. వకీల్ సాబ్‌లో పవన్ లుక్‌ను అనుకరిస్తూ కాళ్లు బారచాపుకుని పోజిచ్చారు.​ "పిచ్చిపని కాని ఈ పనిని ఏ పిచ్చివాడైనా చేస్తాడని నేను అనుకోవడంలేదు" అంటూ కామెంట్ కూడా జత చేశారు. 
 
మరోవైపు, నటి శ్రీరెడ్డితో డేటింగ్‌పై కూడా రాంగోపాల్ వర్మ స్పందించారు. డేటింగ్ అంటే డెఫినిషన్ ప్రకారం ఓ రెస్టారెంటుకో, ఇంకొక చోటుకో ఒకరితో కలిసి బయటకు వెళ్లడమని వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ ఓ అమ్మాయితో కలిసి బయటకు వెళ్లనని చెప్పారు. 
 
తాను లోపలకే వెళ్తానని... సినీ నటి శ్రీరెడ్డితో అయినా సరే తాను డేటింగ్‌కు వెళ్లనని తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వర్మతో డేటింగ్ చేయాలని ఉందని ఇటీవల శ్రీరెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.
 
దీనిపై వర్మ స్పందించారు. ఈ మధ్యన తనను ఒకరు పెళ్లికి ఆహ్వానించారని... పెళ్లికి, అంత్యక్రియలకు తాను రానని చెప్పానని, ఇదే తన రూల్ అని వర్మ తెలిపారు. తన ఉద్దేశంలో ఈ రెండు ఒకటేనని... ఇక్కడ మనసు చచ్చిపోతుందని, అక్కడ మనిషి చచ్చిపోతాడన్నారు. ఒక్క శాతం తెలివి ఉన్నా పెళ్లి చేసుకోకూడదని... అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని... తన మాట వినకపోతే ఆ తర్వాత మీ ఖర్మ అని చెప్పారు.
 
ఇదిలావుంటే, పవన్ కల్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం ఫస్ట్ లుక్ ట్విట్టర్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్ ట్రెండింగ్‌లో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. పీఎస్‌పీకే 26, వకీల్ సాబ్ హ్యాష్ ట్యాగ్‌లతో రిలీజైన ఈ ఫస్ట్ లుక్‌కు సామాజిక మాధ్యమాల్లో అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. 
 
రెండేళ్ల తర్వాత పవన్ మళ్లీ మేకప్ వేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమానే అంగీకరించారు. ఇది బాలీవుడ్ సినిమా 'పింక్' కు రీమేక్. అందులో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ చేస్తున్నారు.

సోమవారం సాయంత్రం 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ రిలీజైందో లేదో అభిమానులు ట్విట్టర్‌లో దండయాత్ర చేస్తున్నారా అనే స్థాయిలో విజృంభించారు. ట్వీట్లు, రీట్వీట్లతో మోత మోగిస్తున్నారు. ఆఖరికి పొలిటికల్ విభాగంలో కూడా లక్షల్లో ట్వీట్లతో ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉండడం పవన్ స్టామినాకు నిదర్శనం అని చెప్పాలి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments