Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్... ఇచ్చట పాత రికార్డులు సవరించబడును...

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (18:47 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం "వకీల్ సాబ్". బాలీవుడ్ చిత్రం 'పింక్‌'కు రిమేక్. పింక్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. పైగా, రెండేళ్ళ విరామం అంటే అజ్ఞాతవాసి తర్వాత పవన్ నటిస్తున్న చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుంటే, దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను సోమవారం రిలీజ్ చేశారు. దీంతో టాలీవుడ్‌లో పండగ వాతావరణం నెలకొంది.
 
పవన్ లుక్ చూసి అభిమానులే కాదు, సెలబ్రిటీలు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. మొత్తమ్మీద పవన్ మేనియాతో ట్విట్టర్ హోరెత్తిపోతోంది. 'వకీల్ సాబ్' లుక్‌పై దర్శకుడు మారుతి తనదైన శైలిలో స్పందించారు. 'ఇచ్చట పాత రికార్డులు సవరించబడును' అంటూ ట్వీట్ చేశారు. 
 
మారుతి మాత్రమే కాదు, యావత్ మెగా హీరోలు పవన్ రాకను స్వాగతించారు. దేవిశ్రీ ప్రసాద్ తమన్, గోపీచంద్ మలినేని, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి ట్విట్టర్‌లో తమ హర్షం వ్యక్తంచేశారు. వచ్చేస్తున్నాడు పవర్ స్టార్ అంటూ ట్వీట్లతో సందడి చేశారు. పలువురు హీరోయిన్లు కూడా స్పందిస్తున్నారు.
 
మరోవైపు, 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లో దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. వారితో కలిసి దిల్ రాజు, తమన్ కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments