Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

డీవీ
గురువారం, 16 మే 2024 (10:57 IST)
Ram Charan, Kiara
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేశారు. ఇప్పుడు రాజకీయ వేడి ఇంకా సెగ పోకుండానే వుంది. మొన్ననే ఎలక్షన్ లు కూడా జరిగాయి. ప్రత్యర్తి పార్టీలు వేరే పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసిన సంఘటనలు చూస్తూనే వున్నాం. సరిగ్గా అలాంటి దాడులు చేస్తూ, ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసే కీలక సన్నివేశాన్ని రామ్ చరణ్ పలువురిపై షూట్ చేశారు.
 
ఇది గేమ్ ఛేంజర్‌ చిత్రం కోసం దర్శకుడు శంకర్ చేసిన హైలెట్ సీన్. దీానిని నిన్న హైదరాబాద్ శివార్లోని నానక్ రామ్ గూడా స్టూడియో సమీపంలో స్టూడియోలో రోడ్లపైనే తెల్లవారుజామున చిత్రీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో పలువురు ఎం.ఎల్.ఎ.లను బస్సులో కిడ్నాప్ చేస్తూ వారిని ఎటాక్ చేసే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు ఆ పరిసరాల్లో చూసిన ప్రజలు చెబుతున్నారు. 
 
ఇప్పటికే దీనికి సంబంధించిన ముందు సీన్ ను ఎల్.బి. స్టేడియంలో ఇటీవలే చిత్రీకరించారు. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తన తండ్రిని చంపేయడంతో కలెక్టర్ అయిన రెండో రామ్ చరణ్.. ప్రస్తుత సి.ఎం.పై చట్టపరంగా చర్యలు తీసుకోనే నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు.
 
ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. వీరితో కూడా ప్రమోషన్స్ ను ప్రారంభించే దిశలో చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది. త్వరలో షూటింగ్ కు ముగింపుదశకు చేరుకోనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ీ సినిమాకు థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments