Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

డీవీ
గురువారం, 16 మే 2024 (10:42 IST)
Devara single poster
ఎన్.టి.ఆర్., జాన్వీ కపూర్ నటిస్తున్న దేవర సినిమా అప్ డేట్ కోసం అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు. ఫస్ట్ సింగిల్ ఎప్పుడూ వస్తుందంటూ డేట్ కోసం వేచిచూడలేక సోషల్ మీడియాలో ఎన్.టి.ఆర్. అభిమానులు.. అప్పట్లో నాగేశ్వరావు సినిమాలో పాడిన ’ఉన్నావా.. అస్సలున్నావా? ఉంటే.. .. ’ అని పేరడీ సాంగ్ ను క్రియేట్ చేసి ఎన్.టి.ఆర్. ను ఇన్ డైరెక్టర్ గా అడుగుతున్నారు. 
 
కాగా, ఈరోజు చిత్ర యూనిట్ మే 19, 2024 న ఫియర్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పోస్టర్ ద్వారా వెల్లడించింది. దాని ఆధారంగా గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా సోషల్ మీడియాలో కొద్ది సేపటి క్రితమే.. మా ప్రియతము "D" కోసం  ప్రేమగా రాసిన భీభత్సం  దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది అని కోట్ చేసి ఫ్యాన్స్ ను ఫిదా చేశారు. అదేవిధంగా ఈ సాంగ్ ను ముందుగానే విన్న ప్రొడ్యూసర్ నాగ వంశీ సోషల్ మీడియాలో తెలుపుతూ, నేను పాట విన్నాను. నన్ను నమ్మండి, హుకుమ్ మర్చిపోతారు అంటూ చెప్పుకొచ్చారు. 
 
కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. అనిరుద్ రవి చందర్ బాణీలు ఇచ్చారు. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. నందమూరికల్యాణ్ నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments