Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

Advertiesment
Director's Association event

డీవీ

, బుధవారం, 15 మే 2024 (19:42 IST)
Director's Association event
మే నాల్గవ తేదీన డా. దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని డైరెక్టర్స్ అసోసియేషన్ తలపెట్టిన భారీ ఈవెంట్ కు బ్రేక్ పడింది. అందుకు ఎలక్లన్లు కారణంగా పర్మిషన్ ఇవ్వడం కుదరదని పోలీసు యంత్రాంగం చెప్పినట్లు వెల్లడించారు. ఆ తర్వాత మరలా డేట్ ను ప్రకటిస్తామని డైరెక్టర్స్ ఇ.సి. మీటింగ్ అనంతరం నిర్ణయించారు.
 
కాగా, ఈలోగా పలు మార్పులు సంభవించాయి. మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డును ఢిల్లీలో అందుకోవడం జరిగింది. మరోవైపు పెద్ద హీరోలు ఎలక్షన్ల ప్రచారం ముగిసింది. ఇక ఆ హీరోల చిత్రాల షూటింగ్ లు కూడా జరుగుతున్నాయి. షడెన్ గా తెలంగాణాలో థియేటర్లను మూవివేస్తూ ఎగ్జిబిటర్లు తీసుకున్నారు. కారణాలు ఏవైనా, డైరెక్టర్స్ అసోసియేషన్ ఎల్.బి. స్టేడియం లో జరిపే గ్రాండ్ ఈవెంట్ కు ప్రముఖ దర్శకులు, హీరోలు అంతా హాజరుకానున్నట్లు పోస్టర్ కూడా విడుదల చేశారు.
 
ఇందుకు టికెట్ కూడా నిర్ణయించారు. గతంలో ఇలా టికెట్ పెట్టినా ప్రజలనుంచి పెద్దగా స్పందన లేదనీ, మరోవైపు చిరంజీవి అవార్డు కూడా తీసుకున్నాక ఈవెంట్ పెడితే మరింత బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకోవైపు టీవీ స్పాన్సర్లు కూడా ఎలక్షన్లబిజీతో ఈ ఈవెంట్ కు కేటాయించలేమని మరో వార్త వినిపించింది.
 
ఏది ఏమైనా, ఇప్పుడు అన్నీ సక్రమంగా వున్నాయి కాబట్టే  భారతదేశపు అతిపెద్ద ఈవెంట్, మే 19న  "డైరెక్టర్స్ డే 2024" ఈవెంట్‌లో అతిపెద్ద వేదికపై మీకు ఇష్టమైన తారలు, దర్శకులను చూసి ఆనందించండి అని ప్రకటన చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది