Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరణ్మయి ఇంద్రగంటి దర్శకత్వంలో 'రాళ్లలో నీరు'

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (21:00 IST)
అనేక డాక్యుమెంటరీలు తీసి, చాలా రచనలు చేసి, సినిమాపై మంచి పరిజ్ఞానం కలిగిన కిరణ్మయి ఇంద్రగంటి తొలిసారిగా డైరెక్ట్ చేసిన చిత్రం 'రాళ్ళలో నీరు'. అనల్ప అండ్ ఫ్రెండ్స్ పతాకంపై అనల్ప ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ మంజూష, అల్తాఫ్, షఫీ, బిందు చంద్రమౌళి, డా. ప్రసాద్ ఇందులో ప్రధాన తారాగణం. 
 
దర్శకురాలు కిరణ్మయి ఇంద్రగంటి మాట్లాడుతూ, '' నేను M.A ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకునే రోజుల్లో నార్వేజియన్ నాటకం 'ఏ డాల్స్ హౌస్' విపరీతంగా ఆకట్టుకుంది. ఎప్పటికైనా ఆ నాటకాన్ని తెరకెక్కించాలనుకున్నాను. ఆ కల ఇప్పటికి నెరవేరింది. తెలుగులో 'కన్యాశుల్కం' ఎలానో, ఇంగ్లీషులో 'డాల్స్ హౌస్' అంత ఫేమస్. 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ రచయిత హెన్రిక్ ఇబ్సన్ ఈ నాటకం రాసారు. చలం తరహాలో ప్రోగ్రెసివ్థాట్స్‌తో ఉండే ఈ నాటకం థీమ్‌ని తీసుకుని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసాను.
 
ఇందులో మొత్తం ఐదు పాత్రలే ఉంటాయి. మనుషుల్లో అంతర్గతంగా ఉండే లోపాల్ని, భావోద్వేగాల్ని ఒడిసిపట్టే విధంగా ఇందులో కథాంశం ఉంటుంది. కథకు తగ్గట్టుగా కాకినాడలో ఓ ఇల్లు దొరికింది. మేజర్ పోర్షన్ అక్కడే చిత్రీకరించాం. కాకినాడలో మొత్తం 28 రోజులు షూటింగ్ చేశాం. ఫస్ట్ కాపీతో సహా సినిమా రెడీగా ఉంది. ఇటీవలే లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అవేర్నెస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్నిప్రదర్శించాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం'' అని తెలిపారు. 
 
ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, ఎడిటింగ్: మార్తాండ్ . కే. వెంకటేష్, కెమెరా: RR కోలంచి, సౌండ్ డిజైనర్: తేజ ASGK, నిర్మాత: అనల్ప, రచన-దర్శకత్వం: కిరణ్మయి ఇంద్రగంటి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అన్న కుమార్తెను వేధిస్తున్నాడని యువకుడి తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి...

ఈ యేడాది నీట్ పరీక్షను ఎలా నిర్వహిస్తారు: ఎన్టీఏ వివరణ

ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం... ఎక్కడ?

18న రాష్ట్ర పర్యటనకు వస్తున్న హోం మంత్రి అమిత్ షా.. ఎందుకో తెలుసా?

కల్లు రెండు గుటకలు వేయగానే నోటికాడికి వచ్చిన కట్లపాము...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments