Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కిరణ్మయి ఇంద్రగంటి ''రాళ్ళలో నీరు''.. ఐదు అంటే ఐదే పాత్రలే...

Advertiesment
కిరణ్మయి ఇంద్రగంటి ''రాళ్ళలో నీరు''.. ఐదు అంటే ఐదే పాత్రలే...
, సోమవారం, 16 నవంబరు 2020 (18:24 IST)
Kiranmayi indraganti
వైవిధ్యభరితమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మోహనకృష్ణ ఇంద్రగంటి ప్రస్తుతం సుధీర్ బాబుతో మరో చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు ఇంద్రగంటి అంటే.. మోహనకృష్ణ ఇంద్రగంటి పేరు బాక్సాఫీస్ వద్ద వినబడేది. ఇప్పుడు ఇంద్రగంటి కిరణ్మయి అని లేడీ డైరెక్టర్ రాబోతోంది.

అనేక డాక్యుమెంటరీలు, రచనలు చేసి.. సినిమా చిత్రీకరణపై పరిజ్ఞానం సంపాదించిన కిరణ్మయి ఇంద్రగంటి.. తొలిసారిగా డైరెక్ట్ చేసిన చిత్రం 'రాళ్ళలో నీరు'. అనల్ప అండ్ ఫ్రెండ్స్ పతాకంపై అనల్ప నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణ మంజూష, అల్తాఫ్, షఫీ, బిందు చంద్రమౌళి, డా. ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు.
 
ఈ సినిమా విశేషాల గురించి దర్శకురాలు కిరణ్మయి ఇంద్రగంటి మాట్లాడుతూ.. ''నేను ఎమ్.ఏ. ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకునే రోజుల్లో నార్వేజియన్ నాటకం 'ఏ డాల్స్ హౌస్' విపరీతంగా ఆకట్టుకుంది. ఎప్పటికైనా ఆ నాటకాన్ని తెరకెక్కించాలనుకున్నాను. ఆ కల ఇప్పటికి నెరవేరింది. 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ రచయిత హెన్రిక్ ఇబ్సన్ ఈ నాటకం రాసారు.
 
చలం తరహాలో ప్రోగ్రెసివ్థాట్స్‌తో ఉండే ఈ నాటకం థీమ్‌ని తీసుకుని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశాను. ఇందులో మొత్తం ఐదు పాత్రలే ఉంటాయి. కథకు తగ్గట్టుగా కాకినాడలో ఓ ఇల్లు దొరికింది. మేజర్ పోర్షన్ అక్కడే చిత్రీకరించాం. కాకినాడలో మొత్తం 28 రోజులు షూటింగ్ చేశాం. ఫస్ట్ కాపీతో సహా సినిమా రెడీగా ఉంది. ఇటీవలే లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అవేర్నెస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ షోలో కాబోయే విజేత ఎవరో చెప్పేసిన ధనరాజ్