Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ నేపథ్యంలో ‘పేపర్ బాయ్' దర్శకుని చిత్రం 'విటమిన్ షి'

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (20:49 IST)
‘పేపర్ బాయ్' చిత్రంతో దర్శకునిగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్న జయశంకర్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ నేపథ్యంలో తాజాగా రూపొందించిన చిత్రం 'విటమిన్ షి'. షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్‌తో యూట్యూబ్‌లో ప్రాచుర్యం పొందిన శ్రీకాంత్ గుఱ్ఱం ఇందులో హీరోగా నటించారు. గుజరాతీ భాషలో రెండు సినిమాల్లో కథానాయికగా నటించిన ప్రాచి ఇందులో హీరోయిన్‌గా చేశారు. 
 
రంజిత్ రెడ్డి, వికాస్, మొయిన్, సంజీవ్ జోషి, అశోక్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్  పతాకంపై రవి పోలిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ- ''ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అనేది మనుషుల జీవితాల్ని ఏ విధంగా ఆక్రమిస్తుందనేది ఈసినిమా మూల కథాంశం. మనకు సహాయకారిగా ఉంటుందనుకున్న ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ చివరకు మనల్నే డామినేట్ చేసే పరిస్థితికి వచ్చేసింది.
 
ఈ పరిస్థితుల్లోఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనేది సెటైరికల్‌గా ఈ సినిమాలో చూపించాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఎంత టాప్ లెవెల్‌కి వెళ్లినా... చివరకు మనుషుల్నే రీప్లేస్ చేసే స్థాయికి వచ్చినా కూడా, మనుషుల ఎమోషన్స్‌ని రీప్లేస్ చేయడం మాత్రంవాటికి అసంభవం. వీటన్నిటినీ ఫన్ మోడ్లో చూపించాం. ఈ సినిమాలో మొత్తం పన్నెడు పాత్రలు ఉంటాయి కానీ, ప్రధానంగా 4 పాత్రల చుట్టే సినిమా తిరుగుతుంది. లాక్డౌన్ టైమ్‌లో ఈ చిత్రం షూటింగ్ చేశాం. స్టోరీ పరంగానే కాకుండా, టెక్నీకల్‌గా కూడా హైస్టాండర్డ్స్‌లో ఉంటుందీ సినిమా. ఇటీవలే ప్రముఖ దర్శకుడు క్రిష్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాం. చాల మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ కాపీతో సహా సినిమామొత్తం రెడీగా ఉంది. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం'' అని తెలిపారు. 
 
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శివప్రసాద్, సంగీతం: PVR రాజు, ఎడిటింగ్ : LN స్టూడియోస్ , నిర్మాత: రవి పోలిశెట్టి, రచన-దర్శకత్వం: జయశంకర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana tunnel tragedy: తెలంగాణ సొరంగంలో రెస్క్యూ పనులు.. మానవ అవశేషాల జాడలు

ఐఐటీ బాంబే క్యాంపస్‌లో మొసలి కలకలం - హడలిపోయిన విద్యార్థులు (Video)

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగికదాడి : నిందితుడుని గుర్తించి బాధితురాలు

మిస్టర్ కేటీఆర్.. పోలీసులతో పెట్టుకోవద్దు.. బెండుతీస్తారు : రాజాసింగ్ వార్నింగ్

Mega DSC : ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ-జూన్‌లోపు నియామక ప్రక్రియ.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments