పుంజుకున్న రకుల్ ప్రీత్ సింగ్...

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (17:57 IST)
టాలీవుడ్‌లో పెద్ద పెద్ద హీరోల సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ జోరు ఇప్పుడు తగ్గింది. కొన్ని పరాజయాలు ఎదురవడం వల్ల మునుపులా ఇప్పుడు ఆఫర్లు రావడం లేదు. దాంతో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రకుల్ ప్రీత్ సింగ్ అజయ్ దేవగన్ సరసన నటిస్తున్న తాజా బాలీవుడ్ చిత్రం "దే దే ప్యార్ దే. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన సీనియర్ హీరోయిన్ టబు, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. టబు అజయ్ దేవగన్ భార్యగా నటిస్తోంది. 
 
రకుల్ ప్రీత్ సింగ్ అతడికి ప్రేయసిగా నటిస్తుండటం విశేషం. మే 17న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ షోలో రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది. ఇటీవల దే దే ప్యార్ దే చిత్రంలోని రొమాంటిక్ వీడియో సాంగ్ విడుదల అయింది. ఈ సాంగ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ చీర కట్టులో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయి డాన్స్ చేసింది. అదే రకుల్ ప్రీత్ సింగ్‌ని ఇబ్బందులలో పడేసింది. 
 
తన హాట్ ఫోటోలను అసభ్యంగా చిత్రీకరిస్తూ కొందరు మార్ఫింగ్ చేసారు. హీరోయిన్‌లకు ఇది కొత్తేమీ కాదు. మార్ఫింగ్ చేసి ఫోటోలని వైరల్ చేయడం ఎప్పుడూ జరిగేదే. రకుల్ ప్రీత్ సింగ్ డాన్స్ చేస్తున్న వీడియోని అసభ్యంగా చిత్రీకరించారు. అవి వైరల్ అయ్యాయి. రకుల్ ప్రీత్ సింగ్ విజయం కోసం ఎదురుచూస్తున్న చిత్రాల విషయానికి వస్తే, తమిళంలో సూర్య సరసన ఎన్ జి కె లో నటిస్తోంది. అలాగే శివకార్తికేయన్ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఇక తెలుగులో కింగ్ నాగార్జున సరసన 'మన్మథుడు-2'లో నటిస్తోంది. ఇవి కనుక హిట్ కొడితే ఆమె మళ్లీ పుంజుకున్నట్లే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments