Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది నా రక్తంలో లేదు: రాధా రవి

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (17:54 IST)
కొన్ని రోజుల క్రితం నయనతార గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన రాధారవి.. వివాదం కాస్తా ముదరడంతో ఆ తర్వాత క్షమాపణలు చెప్పేసిన సంగతి తెలిసిందే. దీంతో అంతా సద్దు మణిగిందే. అయితే ఇటీవల తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ విషయమై మరోసారి స్పందించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
 
వివరాలలోకి వెళ్తే... ఇటీవల ఓ లఘుచిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన గతంలో నయనతార విషయంలో జరిగిన ఉదంతాన్ని గుర్తుచేసుకుంటూ... తాను తప్పుగా మాట్లాడి ఉంటే తన మాటలను వెనక్కి తీసుకుంటానని చెప్పానే కానీ ఎవ్వరికీ క్షమాపణలు మాత్రం చెప్పలేదని అన్నారు. 
 
అలా చెప్పడం తన రక్తంలోనే లేదని పేర్కొన్న ఆయన... అక్కడితో ఆగకుండా ‘‘నేను నయనతారకు ఎందుకు సారీ చెప్పాలి? నేనేమైనా పెద్ద తప్పు చేసానా? ఈ రోజు నేను మాట్లాడుతుంటే జనం ఎలా అయితే చప్పట్లు కొడ్తున్నారో.. ఆ రోజు కూడా జనం అలాగే చప్పట్లు కొట్టారు. నిజం మాట్లాడిన ప్రతీ సారి జనం మద్దతు నాకే ఉంటుంది. నేను ఇక సినిమాల్లో నటించనని చాలా మంది బెదిరిస్తున్నారు... సినిమాలు కాకపోతే నాటకాలు చేసుకుంటా! ఇలాంటివన్నీ తాత్కాలికమే’’ అని రాధా రవి తెలపడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ప్రకటన మరెంత దుమారాన్ని రేపుతుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు నుంచి రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments