Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రగంటి "వ్యూహం"లో నానీ హీరో కాడా?

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (17:51 IST)
నేచురల్ స్టార్ నానీ ప్రస్తుతం... 'జెర్సీ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో బిజీగా వున్నాడు. ఒక వైపున ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, మరో వైపున ఇంద్రగంటి మోహనకృష్ణతో కలిసి నానీ సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధం కావడం, ఈ సినిమాకి 'వ్యూహం' అనే టైటిల్‌ను ఖరారు కావడం అందరికీ తెలిసిన విషయాలే. కాగా... ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా నటించనుండడంతో, ఇది మల్టీ స్టారర్ మూవీ అనే ప్రచారాలు జోరందుకున్నాయి.
 
అయితే ఈ సినిమాలో నానీ కొంతసేపు మాత్రమే కనిపించనున్నాడని తెలుస్తోంది. సినిమా మొత్తం మీద ఆయన పాత్ర 15 నుండి 20 నిమిషాల మధ్య మాత్రమే ఉంటుందనీ అంటున్నారు. 'ఎవడు' సినిమాలో బన్నీ పాత్రలాగా 'వ్యూహం' సినిమాలో నానీ పాత్ర చాలా కీలకంగా నిలుస్తుందే కానీ హీరోగా మాత్రం కాదు అనేది తాజా సమాచారం. అయితే.. ఈ సినిమాకి దిల్ రాజుతో పాటు నానీ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నాడనే టాక్ మాత్రం వినపడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vada Share : వడ షేర్ చేసుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments