చెర్రీతో ఐటమ్ సాంగ్ చేయాలా...? రకుల్ ప్రీత్ సింగ్‌కు చిర్రెత్తుకొచ్చిందట..

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (12:57 IST)
బోయపాటి శీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేసే సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు రకుల్ ప్రీత్ సింగ్ నో చెప్పిందట. ఇప్పటికే చరణ్‌తో హీరోయిన్‌గా నటించిన రకుల్.. ఐటమ్ సాంగ్ అంటేనే ఆమడ దూరంలో నిలిచిందట. బోయపాటి, చెర్రీ కాంబోలో యాక్షన్ ఎంటర్టైనర్‌గా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, 'వినయ విధేయ రామ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 
 
ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్‌ను బాలీవుడ్ భామతో చేయించనున్నారనే టాక్ వచ్చింది. కానీ ఇదే సాంగ్ కోసం రకుల్ ప్రీత్ సింగ్‌ను సంప్రదించినట్లు సమాచారం. తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్‌కి ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోవడంతో.. దీనికి తోడు ఐటమ్ గర్ల్ ఛాన్సులు రావడంతో రకుల్‌కు చిర్రెత్తుకొచ్చిందట. 
 
అంతే బోయపాటి సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేది లేదని తేల్చేసిందట. ప్రస్తుతం తాను బిజీగా ఉన్నాననీ .. ఐటమ్ సాంగ్ చేయడం కుదరదని రకుల్ స్పష్టం చేసిందట. చరణ్‌తో గతంలో రెండు సినిమాల్లో రకుల్ హీరోయిన్‌గా చేసింది. అదే చరణ్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం ఇష్టంలేకనే ఆమె నో చెప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్‌పై రకుల్ దృష్టి పెట్టిందని.. ఆమెకు అక్కడ సినిమా ఛాన్సులు బాగానే వస్తున్నాయని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments