Webdunia - Bharat's app for daily news and videos

Install App

''జబర్దస్త్'' యాంకర్ రష్మీ గౌతమ్‌ స్టెరాయిడ్స్ తీసుకుందట..

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (12:32 IST)
''జబర్దస్త్'' యాంకర్ రష్మీ గౌతమ్‌ ఆటో ఇమ్యూన్ సమస్యలతో స్టెరాయిడ్స్ వాడినట్లు షాకింగ్ న్యూస్ చెప్పింది. బుల్లితెరపై వెండితెరపై తన అందచందాలను ఆరబోస్తూ.. యూత్‌ను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు రుమటాయిడ్ వుందనే సంగతి తెలిసిందే. తాను ట్రీట్మెంట్ తీసుకున్నానని రష్మీ చెప్పింది. దీంతో ఆమెను పరామర్శించే రీతిలో నెట్టింట కామెంట్లు వచ్చాయి. 
 
తను టీట్మెంట్ తీసుకున్నానని రష్మీ చెప్పడం.. చాలామందిని ఆలోచనలో పడేసింది. తాజాగా శిరీష అనే యువతి రష్మికి ట్వీట్ చేస్తూ ''రుమటాయిడ్‌ వ్యాధికి ట్రీట్మెంట్ ఉందో లేదో తెలియదు కానీ... నా భర్త నాలుగేళ్లుగా రుమటాయిడ్స్‌తో బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ నిమిత్తం ఎక్కడికి వెళ్లాలో తెలీడం లేదు. ఒకప్పుడు మీరూ రుమటాయిడ్‌తో బాధపడిన వారే కదా.. మీరేదన్నా ఐడియా ఇవ్వగలరా? అని అడిగింది.
 
వెంటనే  రష్మి స్పందిస్తూ.. ఇందుకు ప్రత్యేక ట్రీట్మెంట్ అంటూ లేదని.. మన లైఫ్ స్టైయిల్‌లో కొన్ని మార్పులు చేసుకోవడంతోనే సరిపెట్టుకోవాల్సి వుంటుందని చెప్పింది. అంతేగాకుండా, ఆయుర్వేద మందులు వాడితే మంచి ఫలితం వుంటుందని తెలిపింది. ఇటీవల తనకు ఆటో ఇమ్యూన్‌ సమస్యలు ఎదురైనప్పుడు స్టెరాయిడ్లు తీసుకున్నానని చెప్పింది. 
 
చిన్నప్పటి నుంచే రుమటాయిడ్స్ నుంచి ఉపశమనం కోసం బాగా నొప్పి కలిగించే స్టెరాయిడ్స్ తీసుకున్నా. ఆ తర్వాత అమ్మ చెప్పిన చిట్కాలను పాటిస్తున్నా. ఆహారం, వ్యాయామమే ఇందుకు మంచి ఔషధం అని చెప్పింది. ఇంకా ఒత్తిడిని దూరం చేసుకోవాల్సి వుంటుందని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments