Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హాట్ యాంకర్, యాక్టర్ రష్మీ గౌతమ్‌‌కు ఆ వ్యాధి వుందట..?

Advertiesment
హాట్ యాంకర్, యాక్టర్ రష్మీ గౌతమ్‌‌కు ఆ వ్యాధి వుందట..?
, శనివారం, 20 అక్టోబరు 2018 (12:13 IST)
జబర్దస్త్ యాంకర్, హాట్ యాక్టర్ రష్మీ గౌతమ్‌ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందట. ఈ విషయాన్ని ఆమే ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. శరీర బరువులో హెచ్చుతగ్గులకు కారణమయ్యే 'రుమాటిజం' అనే వ్యాధి తనకు ఉందని రష్మీ గౌతమ్ వెల్లడించింది. 
 
ఈ విషయం తనకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తెలుసునని రష్మీ ట్విట్టర్లో వెల్లడించింది. ఇటీవల రష్మీని ఓ ఈవెంట్‌లో తాను చూశానని.. చీరలో చాలా లావుగా కనిపించిందని.. శరీరాకృతి విషయంలో జాగ్రత్త వహించాలని ఓ అభిమాని సూచించడంతో, రష్మి స్పందించింది. 
 
తనకున్న వ్యాధి కారణంగానే లావు విషయంలో హెచ్చుతగ్గులు వస్తుంటాయని క్లారిటీ ఇచ్చింది. తాను చిన్నప్పటి నుంచీ ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణగానే ఉంటానని ఆ అభిమానికి తెలిపింది.

ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న సమయంలో దుష్పరిణామాలు వచ్చాయంది. ఇలాంటి విష‌యాలు ఒత్తిడి పెంచి, డిప్రెష‌న్‌కి గురి చేస్తాయి. ఒకవేళ శరీరాకృతిలో తేడా వస్తే గౌరవంగా త‌ప్పుకుంటానని ర‌ష్మీ ట్విట్ట‌ర్ వేదిక‌గా క్లారిటీ ఇచ్చింది.
 
ఇక రష్మి వ్యాధి గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆమెకు జాగ్రత్తలు చెప్తున్నారు. సలహాలు ఇస్తున్నారు. అలాంటి వ్యాధి వున్నా.. బాధను దిగమింగుకుని రాణిస్తుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుమంత్ 25వ సినిమా సుబ్రహ్మణ్యపురం ట్రైలర్ రిలీజ్