Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమన్లు అందలేదు .. రకుల్ :: సమన్లు పంపించింది వాస్తవం .. ఎన్సీబీ

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (16:18 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధం ఉన్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో - ఎన్సీబీ పక్కా ఆధారాలను సేకరించింది. దీంతో గురువారం విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. 
 
ఇంతవరకు తనకు ఎలాంటి నోటీసులు అందలేదని రకుల్‌ చెప్పుకొచ్చింది. తనకు హైదరాబాద్‌, ముంబైలో ఎక్కడా ఎన్సీబీ నుంచి సమన్లు అందలేదని తన‌ మేనేజర్ ద్వారా‌ ఒక ప్రకటన విడుదల చేయించింది. అయితే, షూటింగ్ కోసం హైదరాబాద్‌ వచ్చిన ఆ భామ మళ్లీ హడావుడిగా బుధవారం రాత్రి ముంబైకు చేరుకోవడం గమనార్హం. 
 
మరోవైపు సమన్లు జారీపై ఎన్సీపీ అధికారులు స్పందించారు. తనకు సమన్లు అందలేదంటూ రకుల్ చేసిన వ్యాఖ్యలను ఎన్సీబీ సీనియర్ అధికారి కేపీఎస్ మల్హోత్రా కొట్టిపారేశారు. రకుల్‌కు సమన్లు జారీ చేశామని, ఆమె ఫోనులో అందుబాటులోకి లేకపోవడంతో వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆమెను సంప్రదించామని చెప్పారు. 
 
అయితే, ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని చెప్పారు. ఆమె గురువారం కూడా విచారణకు హాజరు కాలేదని స్పష్టంచేశారు. కాగా, డ్రగ్స్‌ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, దీపికా పదుకొనె వంటి సెలబ్రిటీలను కూడా అధికారులు విచారించనున్న విషయం తెలిసిందే. వీరందరికీ సమన్లు జారీచేయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments