Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్చిలోనే సుశాంత్ ప్రవర్తన మారింది.. రూ.12 కోట్లు డిమాండ్ చేశాడు : జయ సాహు

Advertiesment
Jaya Saha
, బుధవారం, 23 సెప్టెంబరు 2020 (11:50 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో అనేక కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన సీబీఐకు... డ్రగ్స్ కోణం వెలుగు చూసింది. ఈ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. ఈ డ్రగ్స్ ప్రకంపనలు ఇపుడు టాలీవుడ్‌ను తాకాయి. అయితే, సుశాంత్‌కు టాలెంట్ మేనేజరుగా ఉన్న జయ సాహుకు కూడా డ్రగ్స్ దందాలో సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆమెను కూడా ఎన్.సి.బి. అరెస్టు చేసింది. ఆమె వద్ద జరిపిన అనేక విషయాలు ఇపుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 
 
సుశాంత్‌తో తాను చివరిసారిగా జూన్ 5వ తేదీన ఓ సినిమా గురించి మాట్లాడానని వెల్లడించింది. సుశాంత్‌కు టాలెంట్ మేనేజర్‌గా ఉన్న తాను పలు ఆఫర్లను తెచ్చానని, 2016 నుంచి అతనికి సేవ చేశానని తెలిపింది. అయితే, మార్చిలోనే సుశాంత్ ప్రవర్తన మారిపోయిందని, దీంతో తాను ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పినట్టు తెలుస్తోంది. 
 
ముఖ్యంగా, తాను ఇంట్లో ఉన్న కాసేపట్లో హాల్, బెడ్ రూమ్ మధ్య చాలాసార్లు తిరిగాడని, 'కుమార్ మంగళ్' తెరకెక్కించాలని భావించిన చిత్రం గురించి తాము మాట్లాడుకున్నామని విచారణలో తెలిపినట్టు తెలుస్తోంది. ఈ కథ నచ్చిన తర్వాత రూ.6 కోట్లకు సినిమా చేసేందుకు అంగీకరించిన సుశాంత్, ఆ తర్వాత రూ.12 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేశాడని వెల్లడించింది. 
 
దీనికంటే ముందు 'సన్ చురియా' సినిమాకు రూ.5 కోట్లు, 'కేదార్ నాథ్'కు రూ.6 కోట్లు తీసుకున్న సుశాంత్, 'డ్రైవ్'కు రూ.2.25 కోట్లు, 'చిచ్చోరే'కు రూ.5 కోట్లు, 'దిల్ బేచారా'కు రూ.3.5 కోట్లు తీసుకున్నాడని కూడా ఆమె తెలిపింది. అయితే, ఈ డబ్బంతా ఎలా ఖర్చు చేశాడో తనకు తెలియదని ఆమె పేర్కొంది. ఇక తాను 2016 నుంచి 2019 మధ్య 21 వాణిజ్య బ్రాండ్లతో సుశాంత్‌కు ఒప్పందం కుదిర్చినట్టు చెప్పింది. 
 
అంతేకాకుండా, రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధ కపూర్‌తో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులకు డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చినట్టు తెలిపింది. ఈమె వెల్లడించిన వారందరికీ ఎన్.సి.బి సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనురాగ్ కశ్యప్‌పై అత్యాచారం కేసు.. ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదట!