Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ చిత్ర ప్రచారం కోసం హైదరాబాద్‌ వచ్చి సందడి చేసిన ‘రక్షాబంధన్‌ ’ బృందం

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (17:04 IST)
ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ యొక్క తాజా చిత్రం, బంధాలను మనోహరంగా చూపించిన ‘రక్షాబంధన్‌’ చిత్ర బృందం, తమ చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా పలు నగరాలలో సందడి చేస్తున్నారు. రక్షాబంధన్‌ పండుగ సందర్భంగా విడుదల కాబోయే ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఈ బృందం హైదరాబాద్‌ వచ్చింది.


తమ బహుళ నగర ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే ఈ చిత్ర బృందం దుబాయ్‌, పూనె, ఇండోర్‌లలో సందడి చేసింది. ఈ బృందంలో అక్షయ్‌కుమార్‌, నిర్మాత ఆనంద్‌ ఎల్‌ రాయ్‌, చిత్ర తారాగణంలో సాడియా ఖతీబ్‌, స్మృతి శ్రీకాంత్‌, సహేజ్మీన్‌ కౌర్‌, దీపికా ఖన్నాలు హైదరాబాద్‌ విచ్చేశారు.

 
ఇండోర్‌ పర్యటన తరువాత, ఈ చిత్ర బృందం హైదరాబాద్‌కు వచ్చింది. పీవీఆర్‌ లో మీడియా సమావేశంలో పాల్గొన్న వీరు అనంతరం చార్మినార్‌ వద్ద సందడి చేశారు. హైదరాబాద్‌కు తలమానికమైన చార్మినార్‌ వద్ద ఫోటోలనూ దిగారు. తమ అభిమాన సూపర్‌స్టార్‌ తో పాటుగా చిత్ర బృందాన్ని దగ్గరగా చూసేందుకు, వారితో ముచ్చటించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

 
ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి  నిర్మాణ బాధ్యతలను జీ స్టూడియోస్‌తో కలిసి ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ మరియు హిమాంశు శర్మ, అల్కా హిరానందానీ, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్‌  తీసుకున్నాయి. హిమాంశు శర్మ, కనికా ధిల్లాన్‌లు రచన చేయగా, రక్షాబంధన్‌కు సంగీత దర్శకత్వంను  హిమేష్‌ రేష్మియా చేశారు. ఈ చిత్రంలోని పాటలకు సాహిత్యాన్ని ఇర్షాద్‌ కమిల్‌ అందించారు.

 
రక్షా బంధన్‌ చిత్రంలో భూమి పద్నేకర్‌, అక్షయ్‌కుమార్‌, నీరజ్‌ సూద్‌, సీమా పహ్వా, సాదియా ఖతీబ్‌, అభిలాష్‌ థపిల్యాల్‌, దీపికా ఖన్నా, స్మృతి శ్రీకాంత్‌ మరియు సహెజ్మీన్‌ కౌర్‌లు  కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆగస్టు 11, 2022న విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments