వదిన, మరిది వివాహేతర సంబంధం కన్నపేగుకు ఉరి వేసేలా చేసింది. మరిదితో ఉన్న అక్రమ సంబంధాన్ని తెంచుకోలేని ఓ వివాహిత తన రెండేళ్ల కుమార్తెకు ఉరేసి చంపేసింది. ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన తెలంగాణాలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం బానూరు గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	మధ్యప్రదేశ్‌లోని సిమ్రూద్ హయ్యర్ గ్రామానికి చెందిన గజేంద్ర కుసుబ.. పటాన్‌చెరు మండలంలోని ఓ ప్రైవేటు సంస్థలో కార్మికునిగా పని చేస్తున్నారు. భార్య రేఖ(28) కూతురు సోనమ్(2)తో కలిసి బానూరులో నివాసముంటున్నారు. 
 
									
										
								
																	
	 
	అయితే, గజేంద్ర సోదరుడు బసుదేవ కుసుబ(27) బానూరులోని సోదరుని ఇంటి పక్కనే నివాసముంటూ స్థానికంగా ఓ పరిశ్రమలో పనికి చేరాడు. అయితే, రేఖకు, కుసుబలు వారి స్వగ్రామంలో ఉన్నప్పుడే వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం బహిర్గతం కావడంతో పంచాయతీ పెద్దల వరకు వెళ్లింది. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	ఆ తర్వాత బసుదేవ నందిగామ వచ్చిన తర్వాత కూడా ఆ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వదిన మరిది ఏకాంతంగా గడుపుతున్నారు. దీన్ని గజేంద్ర కళ్ళారా చూశాడ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ కూతురు సోనమ్‌కు చీరతో ఉరి వేసిన రేఖ, ఆపై బసుదేవతో కలిసి అదే చీరకు ఉరి వేసుకుని కనిపించింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, గజేంద్ర పక్క గదిలో ఉండగానే ఈ దారుణం జరిగింది. దీనిపై స్థానిక పోలీసుల కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.