Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలమావు కోకిలగా జాన్వీ కపూర్.. నయనతార ప్రశంసలు

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (13:56 IST)
Nayana_Jhanvi
దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ తాజాగా నటించిన చిత్రం గుడ్‌ లక్‌ జెర్రీ. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించిన కోలమావు కోకిలకు ఈ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. 
 
జూలై 29న ఈ మూవీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో రిలీజ్‌ అయ్యిన ఈ చిత్ర పాజిటివ్‌ టాక్‌ను తెచ్చుకుంటుంది. ఇందులో జాన్వీ నటనకు ఆడియన్స్‌ నుంచి మాత్రమే కాదు సినీ ప్రముఖుల నుంచి సైతం ప్రశంసలు అందుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల జాన్వీ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార తనపై ప్రశంసలు కురిపించిందంటూ హర్షం వ్యక్త చేసింది. 
 
గుడ్‌ లుక్‌ జెర్రీ ట్రైలర్‌పై నయనతార సానుకూలంగా స్పందించారని జాన్వీ తెలిపింది. ఆమె తన నటనను ప్రశంసించారని చదివా. దీంతో తనకి థ్యాంక్స్‌ చెప్పాలని నంబర్ తెలుసుకుని మెసేజ్ చేశాను. తన మెసేజ్‌కి వెంటనే ఆమె ఇలా రిప్లై ఇచ్చారు. 
 
'కెరీర్ ప్రారంభంలోనే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషించినందుకు గర్వపడుతున్నా. కోకిల నా మనసుకు చాలా దగ్గరైన పాత్ర. గుడ్ లక్ జెర్రీ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించావు. గుడ్ లక్ జాన్వీ' అంటూ మెసేజ్ చేశారు'' అని చెప్పుకొచ్చింది. 
 
ఇక ఆ తర్వాత 'ఏకంగా లేడీ సూపర్‌ స్టార్‌ నన్ను ప్రశంసించడం మంచి అనుభూతిని ఇస్తుంది. తన ప్రశంస తనకు చాలా ప్రత్యేకం' అంటూ తెగ సంబరపడిపోయింది జాన్వీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments