Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాకేష్ ఒక ఛాలెంజ్ గా బ్లైండ్ స్పాట్ సినిమా చేశాడు : నవీన్ చంద్ర

దేవీ
శనివారం, 19 ఏప్రియల్ 2025 (18:33 IST)
Naveen Chandra, Raashi Singh
నవీన్ చంద్ర 'బ్లైండ్ స్పాట్' అనే మరో ఎక్సయిటింగ్ మూవీతో వస్తున్నారు. రాకేష్ వర్మ దర్శకత్వంలో మ్యాంగో మాస్ మీడియా బ్యానర్ పై రామ కృష్ణ వీరపనేని నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ అంచనాలను క్రమంగా పెంచుతోంది. నిర్మాతలు ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను ఈరోజు లాంచ్ చేశారు.  
 
ట్రైలర్ ఒక థ్రిల్లింగ్ సన్నివేశంతో ప్రారంభమవుతుంది. పనిమనిషి తన భుజాలపై ఒక బిడ్డతో బెడ్‌రూమ్‌లోకి వెళుతుంది. ఓ మహిళ నిర్జీవంగా ఉరి వేసుకున్న దృశ్యం చూసి భయపడుతుంది. పవర్ ఫుల్  పోలీసు ఆఫీసర్ వచ్చి కేసుని పరిశీలిస్తాడు. ఇది ఆత్మహత్య కాదు హత్యని చెబుతాడు. తరువాత  ప్రతి పాత్ర సిక్రెట్ కలిగి వుంటుంది. నిజమైన హంతకుడు ఎవరు? అనే క్యురియాసిటీని క్రియేట్ చేస్తూ చాలా ఎక్సయిటింగ్ ప్రజెంట్ చేశారు.
 
దర్శకుడు రాకేష్ వర్మ  ట్రైలర్‌ను తొలి ఫ్రేమ్ నుంచే ఉత్కంఠను పెంచుతూ, ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ లో ఉంచారు. నవీన్ చంద్ర తన పాత్రకు ఇంటెన్స్ అండ్ డెప్త్ యాడ్ చేసి సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.  ఈ చిత్రంలో రాశి సింగ్, అలీ రెజా, రవివర్మ , గాయత్రి భార్గవి కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
 
దర్శన్ ఎం అంబట్ సినిమాటోగ్రఫీ  విజువల్స్‌తో ప్రత్యేకంగా నిలుస్తుండగా, శ్రీ రామ్ మద్దూరి గ్రిప్పింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టెన్షన్ ని పెంచుతుంది. ఎడిటర్ సత్య జి కట్ గ్రిప్పింగ్ గా వుంది. ట్రైలర్ పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేయడంతో  బ్లైండ్ స్పాట్ మంచి అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది.
 
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ, రాకేష్ లాంటి డైరెక్టర్స్ ఇంకా ముందుకు రావాలి. తను చెప్పిన కథ చాలా గమ్మత్తుగా ఉంది. తను కథ చెప్పినప్పుడే సీట్ ఎడ్జ్ కూర్చున్న ఫీలింగ్ కలిగింది. ఈ స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా నాకు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. రాశి చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ చేసింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఇంత బాగా రావడానికి కారణం సినిమాలో యాక్టర్స్. వీళ్లంతా అద్భుతంగా పెర్ఫామ్ చేయడంతో నా క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఎలివేట్ అయింది. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. కథను నమ్మి ఒక్కొక్క సినిమా చేసుకుంటూ ముందుకు వస్తున్నాను. ఎప్పటిలాగే మీ సపోర్టు ఉండాలని కోరుకుంటున్నాను. ఇది చాలా మంచి థ్రిల్లర్. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ సినిమా పోస్టర్లో ఒక క్లూ ఉంది. అది కనిపెట్టి నాకు మెసేజ్ చేస్తే వాళ్లతో కలిసి నేను సినిమా చూస్తాను. రాకేష్ ఆలోచన నన్ను కట్టిపడేసింది. ఈ సినిమా కోసం మా టీమ్ అంతా డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసింది. రాకేష్ ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈ సినిమా చేశాడు. ఈ సినిమా మిస్ అవ్వకండి. చాలా మంచి థ్రిల్లర్ ఇది' అన్నారు.
 
హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ .. అందరికీ నమస్కారం. ఈ సినిమా నాకు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ డే నుంచే చాలా డిఫికల్ట్ సీన్స్ పెట్టారు. రాకేష్ పర్ఫార్మెన్స్ విషయంలో చాలా పర్టికులర్. ఈ సినిమా అంతా నా క్యారెక్టర్ క్రై చేస్తూనే ఉంటుంది. డైరెక్టర్ చాలా క్లారిటీతో ఈ సినిమా తీశారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ పెట్టాను. నా ఫేవరెట్ జోనర్ ట్రైలర్ లో వస్తున్న సినిమా ఇది. నవీన్ చంద్ర గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆయన నాకు చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది'అన్నారు
 
డైరెక్టర్ రాకేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నవీన్ చంద్ర గారు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్. ఆయన ఎప్పుడూ క్యారెక్టర్ లోనే ఉంటారు మా సినిమా అంతా ఒక సింగల్ నైట్ లో జరుగుతుంది ఆ కంటిన్యూటిని అర్థం చేసుకోవడం చాలా యీజ్ తో పెర్ఫార్మ్ చేశారు. ఆయన ప్రతి ఆర్టిస్టుతో చాలా సపోర్టివ్ గా ఉంటారు. చాలా ఇన్వాల్వ్మెంట్ తో వర్క్ చేస్తారు. రాశి సింగ్ గ్లిజరిన్  లేకుండా కన్నీళ్లు తెచ్చుకునే నటి. ఈ సినిమాల్లో తన క్యారెక్టర్ కి రెండు వేరియేషన్స్ ఉన్నాయి. ఈ రెండు వేరియేషన్స్ ని అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. గాయత్రి గారు ఇందులో చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'అన్నారు.  
 
గాయత్రి భార్గవి మాట్లాడుతూ... రాకేష్ చాలా క్లియర్ విజన్ తో ఈ సినిమా తీశాడు. నవీన్ చంద్ర గారితో కలిసి యాక్ట్  చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈ సినిమాల్లో పని చేసిన అందరి నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను . ఈ సినిమాలో చాలా కొత్త రోల్ లో కనిపిస్తాను. తప్పకుండా మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను'అన్నారు
 
యాక్టర్ రవి వర్మ మాట్లాడుతూ...అందరికీ నమస్కారం. ఈ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ వుండే క్యారెక్టర్ చేశాను నవీన్ చంద్ర తో కలిసి యాక్ట్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. తను ఫైనెస్ట్ యాక్టర్. రాశి చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. రాకేష్ చాలా క్లియర్  విజన్ తో ఈ సినిమా తీశాడు.  ఈ సినిమా మీ అందరిని అలరిస్తుందని కోరుకుంటున్నాను'అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments