సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

దేవీ
శనివారం, 19 ఏప్రియల్ 2025 (18:23 IST)
Eeshwar, Naina Sarwar
ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా  అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించిన మూవీ ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మాణంలో, రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో రూపోందిన ఈ మూవీ ఈ నెల 25న థియేటర్ లలో విడుదల కాబోతుంది. ప్రముఖ నటుడు అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించారు. గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా విడుదల కానుంది.
 
ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ, ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కు డిజిటిల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజైన "మ్యాచింగ్.. మ్యాచింగ్" సాంగ్ తో పాటు టీజర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు అదరిస్తారు, హిట్టు చేస్తారని ఎన్నో సార్లు రుజువైంది. అందుకే ఈ సినిమా చేశాం. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా చాలా సహజంగానే ఉంటాయి. ఈ నెల 25న రిలీజ్ అయ్యే ఈ సినిమాను థియేటర్ లలో చూసి మీరందరూ మమ్మల్ని అదరిస్తారని ఆశిస్తున్నాను.’’ అని అన్నారు.
 
ప్రొడ్యూసర్ అనిల్ కుమార్ కాట్రగడ్డ మాట్లాడుతూ... "మా సూర్యాపేట్ జంక్షన్ మూవీ ఈ నెల 25న ఆంధ్రా, తెలంగాణాలలో గ్లోబల్ సినిమా డిస్ట్రిబ్యూషన్ లో విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా సునీల్ కి, రాంమోహన్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా సూర్యాపేట్ జంక్షన్ సినిమాని థియేటర్ లలో ప్రతి ఒక్కరూ చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతున్న పీకే

కర్ణాటక బస్సులో మంటలు.. 60మంది ప్రయాణీకులు.. రక్షించింది ఎవరంటే?

Perni Nani: కొత్త వివాదంలో పేర్ని నాని.. రంగనాయకులు ఆలయ భూమికి..?

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని...

ప్రేమించిన వ్యక్తి కోసం 600 కిలోమీటర్లు వచ్చి చివరకు అతడి చేతిలోనే శవమైంది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments