Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాఫికింగ్ నేపథ్యంలో రాజశేఖర్ 92వ సినిమా

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (15:31 IST)
Rajasekar Family, Director kiran
రాజశేఖర్ కథానాయకుడిగా కొత్త సినిమాను శనివారం ప్రకటించారు. ఆయన 92వ చిత్రమిది.  గతం' ఫేమ్ కిరణ్ కొండమడుగుల దర్శకత్వంలో రాజశేఖర్ నటించనున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇదే మొదటి సినిమా. ఆఫ్ బీట్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్, ఎస్ ఒరిజినల్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై సినిమా తెరకెక్కుతోంది. 'గతం' నిర్మాతలు భార్గవ పోలుదాసు, హర్ష ప్రతాప్, సృజన్ ఎర్రబోలు... రాజశేఖర్ కుమార్తెలు శివాని-శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శనివారం సినిమా థీమ్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం రాజశేఖర్ నటిస్తున్న 'శేఖర్' పూర్తయిన తర్వాత ఆగస్టులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు కిరణ్ కొండమడుగుల మాట్లాడుతూ "ఇదొక యాక్షన్ థ్రిల్లర్. యాంటీ సోషల్ ఎలిమెంట్ సెక్స్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సినిమా జరుగుతుంది. సినిమా అంతా అమెరికాలో చిత్రీకరించేలా ప్లాన్ చేశాం. హీరో క్యారెక్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. రాజశేఖర్ కి టైలర్ మేడ్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. ప్రేక్షకులందరూ సినిమా చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు" అని అన్నారు.
 
నిర్మాత భార్గవ పోలుదాసు మాట్లాడుతూ "నన్ను 'గతం'లో అర్జున్ పాత్రలో చూసి ఉంటారు. ఆ సినిమా నిర్మాతల్లో నేను ఒకడ్ని. కిరణ్ రాసిన కథ రాజశేఖర్ గారికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నాం. చిత్రీకరణ అంతా అమెరికాలో చేస్తాం. ఈ సినిమా 'గతం' కన్నా మంచి పేరు తెస్తుందనీ, మీరంతా సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు.
 
మ‌రో నిర్మాత హర్ష ప్రతాప్ మాట్లాడుతూ "కిరణ్ దర్శకత్వం వహించిన 'గతం' చిత్రనిర్మాతల్లో నేను ఒకడిని. 'గతం' తర్వాత మరోసారి కిరణ్ దర్శకత్వంలో, హీరో రాజశేఖర్ గారితో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. స్క్రిప్ట్ ప్రకారం సినిమా అంతా అమెరికాలో జరుగుతుంది. ఆగస్టు నుండి అమెరికాలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రొడక్షన్ వేల్యూస్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఒక హాలీవుడ్ యాక్షన్ మూవీలా తీయాలనేది మా ప్రయత్నం. ప్రేక్షకులకు హాలీవుడ్ మూవీ చూసిన ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది. స్క్రిప్ట్ బాగా వచ్చింది. 'గతం' సినిమాను ఆదరించినట్టు ఈ సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

వైకాపాలో శిరోమండనం.. నేటికీ జరగని న్యాయం... బిడ్డతో కలిసి రోదిస్తున్న మహిళ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం