Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ చిత్రానికి మాటే మంత్రము టైటిల్ ఖరారు

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (17:24 IST)
Rahul Vijay, Megha Akash,
రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమాకు "మాటే మంత్రము" అనే టైటిల్ ను ఖరారు చేశారు. రాహుల్ విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై  ఎ సుశాంత్ రెడ్డి,  అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
 
ఈ సందర్భంగా నిర్మాతలు ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట మాట్లాడుతూ...మా హీరో పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేస్తున్నాం. ఈ చిత్రానికి "మాటే మంత్రము" అనే పేరును ఖరారు చేశాం. ఇది మా సినిమాకు యాప్ట్ టైటిల్. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో, రెండో షెడ్యూల్ గోవాలో చిత్రీకరించాం. ప్రస్తుతం 90 శాతం షూటింగ్ పూర్తయింది. గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అన్నారు.
 
నటీనటులు - రాహుల్ విజయ్, మేఘ ఆకాష్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్,అర్జున్ కళ్యాణ్, అభయ్ బెతిగంటి, వైవా హర్ష,బిగ్ బాస్ సిరి తదితరులు
 
సాంకేతిక నిపుణులు - సంగీతం: హరి గౌర, ఎడిటర్: ప్రవీణ్ పూడి,
ఆర్ట్ డైరెక్టర్ : కె. వి రమణ
సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి
పి.ఆర్.ఓ : జిఎస్ కె మీడియా
డిజిటల్ మార్కెటింగ్: టాక్ స్కూప్
నిర్మాత: ఏ.సుశాంత్ రెడ్డి & అభిషేక్ కోట, సమర్పణ: బిందు ఆకాష్, నిర్మాణ సంస్థలు: కోటా ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్, కథ : ఏ.సుశాంత్ రెడ్డి, దర్శకత్వం - అభిమన్యు బద్ది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతీయులకు అమెరికా శుభవార్త.. ఆ వీసాలో మార్పులు

పాదగయ క్షేత్రం ప్రసాదంలో పురుగులు.. పవన్ కల్యాణ్ ఇలాకాలో ఇలానా? (video)

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమానులపై నాలుగు కేసులు - ఎందుకో తెలుసా?

145 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనాలని అంటున్నారు ఎందుకు?

పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మాయం... క్రిమినల్ చర్యలు తప్పవు : మంత్రి నాదెండ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments