Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌త్య‌దేవ్ మూవీ గాడ్సే నుంచి వీడియో సాంగ్ రిలీజ్

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (17:00 IST)
Satyadev, Godse
‘‘రా రమ్మంది ఊరు.. ర‌య్యిందీ హుషారు
రాగ‌మందుకుంది జ్ఞాప‌కాల జోరు
ప‌చ్చ‌నైన చేలు ప‌ల్లె ప‌రిస‌రాలు
ఎంత కాల‌మైనా మ‌రువ లేరు నా పేరు... ’’ 
 
అంటూ చాలా ఏళ్ల త‌ర్వాత ఊరికి వ‌చ్చిన ఓ యువ‌కుడు త‌న చిన్ననాటి స్నేహితుల‌ను క‌లుసుకుంటే వారెలా రియాక్ట్ అయ్యార‌నే విష‌య‌ల‌ను తెలుసుకోవాలంటే ‘గాడ్సే’ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు నిర్మాత సి.కళ్యాణ్. వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌’ వంటి సూప‌ర్ హిట్ మూవీ రూపొందిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈ హిట్ కాంబో క‌లిసి చేస్తోన్న గాడ్సే చిత్రంపై టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జూన్ 17న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. 
 
తాజాగా ఈ సినిమా నుంచి ‘రా రమ్మందీ ఊరు..’ అనే వీడియో సాంగ్‌ను మంగ‌ళ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. స‌త్య‌దేవ్ లుక్‌, శాండీ Addanki, సునీల్ క‌శ్య‌ప్ సంగీతం, సురేష్‌.ఎస్ సినిమాటోగ్ర‌ఫీ స‌న్నివేశాల‌ను ఎన్‌హెన్స్ చేస్తున్నాయి. రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాసిన  రా ర‌మ్మంది ఊరు .. అనే పాట‌ను రామ్ మిర్యాల పాడారు. 
 
సి.కె.స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సి.క‌ళ్యాణ్ నిర్మించారు. ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌టంతో పాటు ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను కూడా గోపి గ‌ణేష్ అందిస్తున్నారు. అవినీతిమ‌య‌మైన రాజ‌కీయ నాయ‌కుల‌ను, వ్య‌వ‌స్థ‌ను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్య‌వంతుడైన యువ‌కుడి పాత్ర‌లో స‌త్య‌దేవ్ క‌నిపించ‌నున్నారు. ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ఇందులో ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుంది. బ్ర‌హ్మాజీ ,సిజ్జూ మీన‌న్ తదిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KCR: జీవితంలో తొలిసారి అమెరికాకు కేసీఆర్.. ఎందుకో తెలుసా?

Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు.. చివరికి?

జమిలి ఎన్నికల బిల్లు.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయ్- చంద్రబాబు

స్కూలుకు వెళ్లే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి కట్టేసి పెళ్లి చేసేసారు (video)

Anna Canteens: నగరాల్లో కాదు.. గ్రామాలకు చేరనున్న అన్న క్యాంటీన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments