Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయ దేవరకొండ విడుదల చేసిన పంచతంత్రం లిరికల్ వీడియో

Advertiesment
విజయ దేవరకొండ విడుదల చేసిన పంచతంత్రం లిరికల్ వీడియో
, సోమవారం, 4 ఏప్రియల్ 2022 (16:01 IST)
Panchatantra Lyrical song
టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ పతాకంపై కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య నటీనటులుగా హర్ష పులిపాక ను దర్శకుడిగా పరిచయం చేస్తూ అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘'పంచతంత్రం''.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్భంగా ఈ చిత్రంలోని "అరెరే అరెరే మాటే..రాదే..మనసే పలికే క్షణములో"... లిరికల్ వీడియోను సెన్సేషల్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు
 
అరెరే అరెరే మాటే..రాదే.. మనసే పలికే క్షణములో... 
లిరికల్ వీడియోను కిట్టు విస్సాప్రగడ రాయగా ప్రశాంత్‌ ఆర్‌. విహారి, శ్రవణ్ భరద్వాజ్ లు  సంగీతం అందించారు.ఈ పాటని చిన్మయి,ఎస్.పి చరణ్ లు అద్బుతంగా ఆలపించారు.రాజ్ కె నల్లి కెమెరా విజువల్స్ ఫ్రెష్ ఫీల్ ని కలిగిస్తుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ... ఇంతకు ముందు వచ్చిన పెళ్లి పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ మధ్య కాలంలో ఇటువంటి పాటలు ఫీలింగ్ తగ్గిందని చెప్పుకోవాలి..."అరెరే అరెరే మాటే..రాదే.. మనసే పలికే క్షణములో".. పాట చూసిన తరువాత మళ్లీ  గత జ్ఞాపకాలను ప్రేక్షకులను కంపల్సరీ గా మంత్ర ముగ్దులను చేస్తాయి. అలాగే వారి జీవితంలో జరిగిన పెళ్లి తంతుల్ని రీకలెక్ట్ చెసే పాటగా ఈ పాట నిలిచిపోతుంది.మేము ఇంతకు ముందు బ్రహ్మానందంపై విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫ‌స్ట్ గ్లింప్స్‌, ఏ రాగమో లిరికర్ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విజయదేవరకొండ చేతుల మీదుగా విడుదల చేసిన "అరెరే.. అరెరే.. మాటే..రాదే.. మనసే పలికే క్షణములో..లిరికల్ వీడియో సాంగ్ కూడా అదే స్థాయిలో అలరిస్తుందనే నమ్మకం ఉంది. బ్రహ్మానందం గారు ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులను నవ్వించారు. అలాగే ఆయనలో అద్భుతమైన నటుడు ఉన్నారు. వెయ్యి చిత్రాలకు పైగా చేసిన బ్రహ్మానందం గారు మా సినిమాలో వేదవ్యాస్ గా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మురారి లాంటి సినిమా చేయాల‌నుంది - అశోక్ గ‌ల్లా