Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెజీనా ఆశలన్నీ 'సానా కష్టం' ఐటమ్ సాంగ్‌పైనే...

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (13:03 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాలశివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చిత్రం "ఆచార్య". మ్యాట్నీ మూవీ మేకర్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు కలిసి నిర్మిస్తున్నారు. హీరో రామ్ చరణ్ కీలక పాత్రను పోషించిన ఈ చిత్రం ఈ యేడాది ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రంలోని పాటలను అపుడపుడూ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే "లాహె లాహె", "నీలాంబరీ" పాటలను రిలీజ్ చేయగా, వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 
 
తాజాగా "సానా కష్టం వచ్చిందే మందాకినీ.. చూసేవాళ్ళ కళ్లు కాకులెత్తుకుపోనీ... సానా కష్టం వచ్చిందే మందాకినీ.. నీ నడుము మడతలోన జనం నలిగిపోనీ..." అంటూ ఈ పాట ప్రోమోను రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఈ పాట ఐటమ్ సాంగ్‌లా కనిపిస్తుంది. 
 
ఈ చిత్రంలో గిరిజనలు బతుకు చిత్రాలను కళ్లకు కట్టిలా దర్శకుడు చూపించనున్నట్టు ఇప్పటికే విడుదలైన చిత్ర ప్రోమోల ద్వారా స్పష్టమైంది. లాహె లాహె పాట గిరిజన సంస్కృతిని ప్రతిబింభించేలా వుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. 
 
అయితే, ఈ సానా కష్టం చిత్రంలో రెజీనా కెసాండ్రా అదిరిపోయేలా డ్యాన్స్ చేసింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో పోటీపడుతూ నర్తించింది. పైగా, "పుష్ప"లో సమంతకు "ఊ మావ.. ఊ ఊ మావ" సాంగ్ ఏ రేంజ్‌లో పేరు తెచ్చిపెట్టిందో.. అదే విధంగా సానా కష్టం సాంగ్‌పై రెజీనా కెసాండ్రా ఆశలుపెట్టుకుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments